జూనియర్ లెక్చరర్ పోస్టుల నియామకానికి సంబంధించి తెలంగాణలో ఇదే తొలి నోటిఫికేషన్. భారీ సంఖ్యలో పోస్టులు కూడా ఉండటంతో ఈ సారి పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. జూన్ లేదా జులైలో పరీక్ష ఉంది కదా.. అని ఆలస్యం చేయకుండా ఇప్పటినుంచి ప్రిపరేషన్ మొదలు పెడితేనే ఈ జాబ్ సాధించటం ఈజీ అవుతుంది. తెలంగాణలో జూనియర్ లెక్చరర్ జాబ్ సాధించాలంటే.. ఏమేం చదవాలి.. ఎవరెవరు అర్హులవుతారు.. ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి.. సిలబస్‌లో ఏమేం మార్పులు చోటు చేసుకున్నాయి.. పరీక్ష విధానమెలా ఉంటుంది.. నిపుణులు చెబుతున్న సలహాలు సూచనలు తెలుసుకుందాం.
READ THIS: 1392 జూనియర్ లెక్చరర్ ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్.. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలివే..
తెలంగాణలో జూనియర్ లెక్చరర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. 27 వివిధ సబ్జెక్టులకు సంబంధించి 1392 జేఎల్ పోస్టులను రాత పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఈ నెల 16 నుంచి అప్లికేషన్లు మొదలవుతాయి. 2023 జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ లేదా జులైలో రాత పరీక్ష నిర్వహిస్తారు.
అర్హత:
సంబంధిత సబ్జెక్ట్లో 50శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ (ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్) లేదా బీఏ హానర్స్, బీఎస్సీ హానర్స్, బీకాం హానర్స్ 50శాతం మార్కులతో పాసైన వారు అర్హులు. ఇందుకు సంబంధించిన సమాన అర్హత కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే జూనియర్ లెక్చరర్స్ సివిక్స్ కు అప్లై చేసేవారు పొలిటికల్ సైన్స్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిస్టెన్స్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ చదివిన వారు అర్హులే.
ఎగ్జామ్ ప్యాటర్న్:
జూనియర్ లెక్చరర్ ఎంపికకు నిర్వహించే పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1 జనరల్ స్టడీస్ లో 150 మార్కులకు150 ప్రశ్నలు ఇస్తారు. పేపర్–2 సంబంధిత సబ్జెక్ట్లో 150 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 300 మార్కులకు ఉంటుంది. ఈ రెండు పరీక్షలు మల్టీపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. ఎగ్జామ్ జూన్ లేదా జులైలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొంది.
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్
పేపర్–1 | జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ | 150 X 1 | 150 |
పేపర్–2 | సంబంధిత సబ్జెక్ట్ (పీజీ లెవల్) | 150 X 2 | 300 |
సెలెక్షన్ ప్రాసెస్:
రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఉండదు. నెగెటివ్ మార్కింగ్ లేదు. ఓసీ, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్, ఈడబ్ల్యూఎస్ 40శాతం, బీసీ 35శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు 30శాతం కంటే తక్కువ కాకుండా మార్కులు సాధించాల్సి ఉంటుంది.
సిలబస్
కరెంట్ అఫైర్స్ (ప్రాంతీయం, జాతీయం, అంతర్జాతీయం)
అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ
పర్యావరణ అంశాలు, విపత్తుల నిర్వహణ
భారతదేశ, తెలంగాణ ఆర్థిక, సామాజికాభివృద్ధి
భారతదేశ భౌగోళిక, సాంఘిక, ఆర్థిక జాగ్రఫి
తెలంగాణ భౌగోళిక, సాంఘిక, ఆర్థిక జాగ్రఫి
ఆధునిక భారతదేశ చరిత్ర
తెలంగాణ చరిత్ర, ఉద్యమం
భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ
ప్రభుత్వ విధానాలు, పరిపాలన, సామాజిక వెలి
తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర
తెలంగాణ ప్రభుత్వ విధానాలు
లాజికల్ రీజనింగ్
అనలిటికల్ ఎబిలిటీ
దత్తాంశ విశ్లేషణ
బేసిక్ ఇంగ్లిష్
సిలబస్ మారింది
- ఉమ్మడి రాష్ట్రంలో 2007లో చివరి జేఎల్ రిక్రూట్మెంట్ జరిగింది. అప్పటితో పోలిస్తే టీఎస్పీఎస్సీ ఈసారి సిలబస్‌లో స్వల్పంగా మార్పులు చేసింది. ప్రధానంగా పేపర్–1 జనరల్ స్టడీస్‌లో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.
- భారతదేశ భౌతిక, సాంఘిక, ఆర్థిక భూగోళశాస్త్రం, తెలంగాణ భౌతిక, సాంఘిక, ఆర్థిక భూగోళశాస్త్రం, తెలంగాణ రాష్ట్ర జనాభాశాస్త్రం, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ఆధునిక భారతదేశ చరిత్ర, ముఖ్యంగా భారతదేశ జాతీయోద్యమం, సామాజిక ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక తెలంగాణ చరిత్ర, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రోద్యమం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాలను కొత్తగా సిలబస్‌లో చేర్చారు.
- తెలంగాణ ఉద్యమ చరిత్ర, భారతదేశ, తెలంగాణ భూగోళశాస్త్రం అంశాలను పూర్తిస్థాయిలో లోతుగా చదవాల్సి ఉంటుంది. వీటి నుంచే దాదాపు 50 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర, భారతదేశ, తెలంగాణ భూగోళశాస్త్రాలను మొదటిసారి చదివే వారికి కనీసం రెండు నెలలు సమయం పడుతుంది.
- కొత్త సిలబస్‌లో ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే ఉంది. క్రీ.శ. 1600 నుంచి 1947 వరకు చదివితే సరిపోతుంది. ముఖ్యంగా భారతదేశ జాతీయోద్యమ కాలమైన 1885 నుంచి 1947 వరకు సంపూర్ణంగా చదవాలి. ఇతర పోటీ పరీక్షలతో పోలిస్తే జూనియర్ లెక్చరర్ జనరల్ స్టడీస్ పేపర్ హార్డ్ గా ఉంటుంది. అందుకే అభ్యర్థులు లోతుగా చదవాల్సి ఉంటుంది.
పీజీ స్థాయిలో ప్రశ్నలు
జేఎల్ పేపర్–2 లో ఒక్క ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. అంటే ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సిలబస్ ప్రకారం పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవల్లో ఉంటుంది. యూనివర్సిటీల పీజీ పుస్తకాలు ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు ఉపయోగపడుతాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.
ఉదాహరణకు జనరల్ స్టడీస్ లో భారతదేశ జాగ్రఫి ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటుంది. కానీ జేఎల్ పేపర్‌కు డిగ్రీ స్థాయిలో చదవాలి. కాన్సెప్ట్ పై పట్టు సాధించాలి. సెకండ్ పేపర్‌కు చదివేటప్పుడు భౌతిక భూగోళశాస్త్రం, సాంఘిక భూగోళ శాస్త్రం, ఆర్థిక భూగోళ శాస్త్రం క్షుణ్నంగా చదవాలి.
Good support in group presentation