తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నుంచి ఇటీవల ఉద్యోగాల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని 1392 జూనియర్ లెక్చరర్ (Junior Lecturer) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. ఈ ఏడాది జులైలో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో వీటిని భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీకి అనుమతి ఇచ్చింది.
ఇటీవలే రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లకు అనుగుణంగా జూనియర్ లెక్చరర్ల రిక్రూట్మెంట్కు సంబంధించి టీఎస్పీఎస్సీ (TSPSC) ఏర్పాట్లు చేసింది. తాజాగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 6ను ఆఖరి తేదీగా నిర్ణయించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. 2023 జూన్ లేదా జులైలో ఈ పరీక్ష నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన డిటైల్డ్ నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో త్వరలో అప్లోడ్ చేయనున్నారు.
READ THIS: జూనియర్ లెక్చరర్ సిలబస్.. పరీక్షా విధానం
సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
1. అరబిక్ -2
2. బోటనీ-113
3. బోటనీ (UM)-15
4. కెమిస్ట్రీ-15
5. కెమిస్ట్రీ(UM)-15
6. సివిక్స్-56
7. సివిక్స్(UM)-16
8. సివిక్స్ (M/M)-01
9. కామర్స్-50
10. కామర్స్ (UM) -07
11. ఎకనామిక్స్-81
12. ఎకనామిక్స్(UM)-15
13. ఇంగ్లిష్-153
14. ఫ్రెంచ్-02
15.హిందీ-117
16.హిస్టరీ-77
17.హిస్టరీ (UM)-17
18.హిస్టరీ (MM)-01
19.మాథ్స్-154
20.మాథ్స్-(UM) 09
21.ఫిజిక్స్-112
22.ఫిజిక్స్ (UM)-18
23.సంస్కృతం-10
24.తెలుగు-60
25.ఉర్దూ-28
26.జువాలజీ-128
27.జువాలజీ (UM)-18
మొత్తం: 1392