HomeLATESTగ్రూప్​ 2.. డీఎస్సీ పరీక్షల వాయిదా !

గ్రూప్​ 2.. డీఎస్సీ పరీక్షల వాయిదా !

అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్.. గ్రూప్ 2 మరోసారి వాయిదా పడనుంది. నవంబర్​ 2, 3 తేదీల్లో గ్రూప్​ 2 పరీక్ష జరగాల్సి ఉంది. నవంబర్​ 3నుంచి ఎన్నికల నామినేషన్లు స్వీకరిస్తారు. దీంతో పరీక్షల నిర్వహణ కష్టమేననీ టీఎస్పీఎస్సీ భావిస్తోంది. 5.51 లక్షల మంది పరీక్ష రాయాల్సి ఉంది. ఎగ్జామ్​ సెంటర్లకు సరిపడే సిబ్బంది సర్దుబాటు కష్టమవుతుందని టీఎస్​పీఎస్​సీ పునరాలోచనలో పడింది. వాయిదా వేసేందుకే మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. ఎన్నికల తర్వాతే పరీక్ష నిర్వహించే ఛాన్స్​ ఉంది.

Advertisement

మరోవైపు అదే నెలలో జరగాల్సిన డీఎస్సీ పరీక్ష వాయిదా పడే అవకాశాలున్నాయి. నవంబర్‌ 20 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షల షెడ్యూలు ప్రకటించారు. ఎన్నికలతో ఈ పరీక్షలను వాయిదా వేయాల్సి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.5089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రస్తుతం అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా, ఇప్పటికీ 54వేల మంది అప్లై చేశారు.

నవంబర్ 30న పోలింగ్ జరుగనుంది. ఆ తేదీకి ముందు నాలుగు రోజులు… తర్వాత మూడు రోజుల పాటు ఎలాంటి ఎగ్జామ్ పెట్టేందుకు అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 25 నుంచి 30 వరకూ జరిగే ఎస్​జీటీ పరీక్షల నిర్వహణ కష్టమేననీ తెలుస్తోంది. అన్ని పరీక్షలు వాయిదా వేయాలా.. కొన్నింటిని పోస్ట్ పోన్​ చేయాలా.. అనేది చర్చ జరుగుతోంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

2 COMMENTS

  1. Please send me CBSE books of Mathematics of Class VI to X class for preparation of competition exam

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!