HomeLATESTసాయుధ బలగాల్లో 1876 ఎస్​ఐ జాబ్స్​

సాయుధ బలగాల్లో 1876 ఎస్​ఐ జాబ్స్​

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్ (DELHI POLICE), సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో సబ్-ఇన్‌స్పెక్టర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్​ ద్వారా కేంద్ర సాయుధ బలగాల్లో మొత్తం 1876 సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

Advertisement

ఖాళీలు: మొత్తం 1876 ఉద్యోగాల్లో సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్(బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ)లో సబ్-ఇన్‌స్పెక్టర్ (జీడీ) 1714  ఉన్నాయి. ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)- పురుషులు/ మహిళలకు 162 పోస్టులు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

అప్లికేషన్లు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్లో పరీక్ష నిర్వహిస్తారు. వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి. 

Advertisement

సెలెక్షన్ ప్రాసెస్:  నాలుగు దశల్లో నిర్వహించే టెస్ట్‌ల ద్వారా సెలెక్షన్​ జరుగుతుంది. మొదటి దశలో పేపర్–1, రెండో దశలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, మూడో దశలో పేపర్–2, నాలుగో దశలో డీటెయిల్డ్ మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు.

పేపర్–1లో నాలుగు సబ్జెక్టుల నుండి 200 మార్కులకు 200 ప్రశ్నలిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 50, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50, ఇంగ్లీష్ కాంప్రహెన్సన్ నుంచి 50 మార్కులుంటాయి. పేపర్–2 మొత్తం 200 మార్కులకు ఇంగ్లీష్ అండ్ కాంప్రెహెన్సన్ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలొస్తాయి. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ ప్యాటర్న్‌లోనే ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 శాతం మైనస్ అవుతుంది. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీలో ముద్రిస్తారు. రెండు పేపర్లలో క్వాలిఫై కావాలంటే జనరల్ అభ్యర్థులు 30 శాతం, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్లు 25%, ఎస్సీ, ఎస్టీలు 20 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

ఫిజికల్ టెస్ట్స్

Advertisement

రాతపరీక్షలతో పాటు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు కలిగి ఉండాలి. 100 మీటర్ల పరుగును 16 సెకన్లలో, 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6.5 నిమిషాల్లో, 3.65 మీటర్ల లాంగ్ జంప్ 3 చాన్స్‌ల్లో చేయాలి. 1.2 మీటర్ల హైజంప్, 4.5 మీటర్ల షాట్పుట్ విసరాల్సి ఉంటుంది. మహిళలకు నిబంధనల్లో కాస్త సడలింపు ఉంటుంది. పురుషులకు గాలి పీల్చినప్పుడు ఛాతీ 5 సెం.మీ. విస్తరించాలి. శరీరంపై నిర్దేశించిన ప్రమాణాల మేరకే టాటూలో అనుమతిస్తారు. అంటే శరీరభాగంలో 1/4వ వంతు ఉండాలి. శరీర భాగాల కిందివైపు కన్పించకుండా ఉండాలి. మతానికి సంబంధించిన పేర్లు, చిహ్నాలు మాత్రమే అనుమతిస్తారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!