HomeLATESTడిగ్రీతో వేలల్లో ఢిల్లీ పోలీస్​ ఉద్యోగాలు

డిగ్రీతో వేలల్లో ఢిల్లీ పోలీస్​ ఉద్యోగాలు

ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌) విభాగాల్లో ఎస్సై ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ రెడీగా ఉంది. ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్స్‌ 2024-–25 క్యాలెండర్‌ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ మేరకు సబ్-ఇన్‌స్పెక్టర్ ఎగ్జామ్​-2024కు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల కానుంది. ఈ పరీక్ష ద్వారా ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులు మార్చి 14లోగా ఆన్‌లైన్‌లో అప్లై దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

లక్షల్లో జీతం

పోలీస్​ ఉద్యోగాలకు మే లేదా జూన్‌లో రాత పరీక్ష ఉంటుంది. అభ్యర్థి వయసు 20- నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. గతేడాది 1,876 ఖాళీలు భర్తీ అయ్యాయి. ఎంపికైన వారికి నెలకు రూ.35,400-రూ.1,12,400 వేతనం అందనుంది. సీబీటీ రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (సీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ప్రిపరేషన్​లో స్పీడ్​ పెంచితే ఉద్యోగం సాధించవచ్చు. పూర్తి వివరాలకు www.ssc.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!