HomeLATESTఐడీబీఐలో జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్స్​

ఐడీబీఐలో జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్స్​

దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఐడీబీఐ 500 జూనియర్‌ అసిస్టెంట్ మేనేజ‌ర్ల భ‌ర్తీ ప్రక్రియ చేప‌ట్టింది. ఈ మేర‌కు నోటిఫికేష‌న్ వెలువడింది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ (గ్రేడ్‌-ఓ) ఉద్యోగం ల‌భిస్తుంది.

Advertisement

అర్హత‌: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాల‌యం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. వ‌య‌సు 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: అర్హులైన అభ్యర్థుల‌కు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రతిభ క‌న‌బ‌ర్చిన వారు ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూల‌కు అర్హత సాధిస్తారు. ప‌రీక్ష మొత్తం 200 మార్కుల‌కు నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాలు.. లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనాలసిస్‌, ఇంటర్‌ప్రిటేషన్ (60 ప్రశ్నలు, 60 మార్కులు), ఇంగ్లీష్‌ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు, 40 మార్కులు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (40 ప్రశ్నలు, 40 మార్కులు), జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్ (60 ప్రశ్నలు, 60 మార్కులు) అంశాల‌ నుంచి మొత్తం 200 ప్రశ్నలు వ‌స్తాయి. సమయం రెండు గంటలు ఉంటుంది. ప‌రీక్షలో నెగెటివ్​ మార్కింగ్​ ఉంటుంది. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు.

ద‌ర‌ఖాస్తులు: అభ్యర్థులు ఆన్‌లైన్​లో ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 26 వరకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200, ఇతరులు రూ.1000 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. మార్చి 17న రాతపరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.idbibank.in వెబ్​సైట్​లో సంప్రదించాలి. ఎంపికైన అభ్యర్థుల‌ను ఏడాదిపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్‌) కోర్సులో చేరుస్తారు. ఆ స‌మ‌యంలో అభ్యర్థులు కోర్సు ఫీజు కింద రూ.3,00,000 చెల్లించాల్సి ఉంటుంది. అర్హత గ‌ల అభ్యర్థుల‌కు ఐడీబీఐ బ్యాంకు విద్యారుణం సైతం మంజూరు చేస్తుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!