తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(జెన్కో)లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష తేదీలను యాజమాన్యం విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్షను మార్చి 31వ తేదీన హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. షిఫ్ట్-1 ఉదయం 9.00 నుంచి 10.40 (మెకానికల్/ కెమిస్ట్), షిఫ్ట్-2 మధ్యాహ్నం 1.00 నుంచి 2.40 వరకు (ఎలక్ట్రికల్), షిఫ్ట్-3 సాయంత్రం 5.00 నుంచి 6.40 వరకు (సివిల్/ ఎలక్ట్రానిక్స్) పరీక్ష ఉంటుంది.
ఏఈ జాబ్స్ 339, కెమిస్ట్ పోస్టులు 60
తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలో 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు సంస్థ యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు సంస్థ పేర్కొంది.