కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలతో (Government Jobs) సమానంగా పోటీ ఉంటుంది. ఆయా సంస్థలు సైతం వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తూ నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ ఉంటాయి. కరోనా సమయంలో కాస్త ఆగిన నియామకాలు (Recruitments) తాజాగా మళ్లీ జోరందుకున్నాయి. ఇటీవల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. తాజాగా హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ (SPP) నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31 అంటే సోమవారం ఆఖరి రోజుగా నిర్ణయించారు. అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్ సైట్ (https://spphyderabad.spmcil.com/Interface/AboutOurLogo.aspx)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 83 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (Job Notification) స్పష్టం చేశారు. ఇంకా విద్యార్హతల విషయానికి వస్తే.. టెన్త్ తో పాటు సంబంధిత స్పెషలైజేషన్లలో ఐటీఐ/డిప్లొమా విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి.
– నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
– దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.