బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల (Bank Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (Bank Jobs Notification)పేర్కొన్నారు. ఐటీ ప్రొఫెషనల్స్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను బ్యాంక్ అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల అంటే నవంబర్ 9ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హతలు:
బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్ లేదా ఐన్ఫర్మేషన్ టెక్నాలజీ) అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.600 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, PWD, మహిళా అభ్యర్థులకు ఫీజులో రాయితీ ఉంటుంది. వారు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ లింక్- Link1
అప్లికేషన్ లింక్-Link 2