మూడు అంచెల్లో నిర్వహించే ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. రెండో దశలో నిర్వహించే ఈవెంట్స్‌లో విజయం సాధిస్తేనే చివరి రేసులో ఉంటారు. కానిస్టేబుల్, ఎస్‌ఐ పరీక్షల ఈవెంట్స్ ఒకే విధంగా ఉంటాయి. ఫైనల్ సెలెక్షన్‍లో ముఖ్యమైన ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తూనే మెయిన్స్‌కు సిద్ధమయితే ఖాకీ కొలువు సులువుగా సాధించవచ్చు.
ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులకు పీఎంటీ (ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్), పీఈటీ (ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్) లను నిర్వహిస్తారు. గత నోటిఫికేషన్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిలో కేవలం 40 శాతం మంది మాత్రమే ఈవెంట్స్‌లో క్వాలిఫై అయ్యారు. రాత పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా ఈవెంట్స్‌లో ఎక్కువ మార్కులు పొంది జాబ్ సొంతం చేసుకున్న అభ్యర్థులు చాలా మంది ఉన్నారు.
శారీరక ప్రమాణాలు
పురుష అభ్యర్థులు ఎత్తు 167.6 సెం.మీ. కంటే తక్కువ ఉండకూడదు. ఛాతీ 81.3 సెం.మీ (ఊపిరి పీల్చినప్పుడు 5 సెం.మీ పెరగాలి. అంటే 86.3కి పెరగాలి). మహిళా అభ్యర్థులు ఎత్తు 152.5 సెం.మీ. కంటే తక్కువ ఉండకూడదు. ఈ కొలతలు పూర్తయిన తర్వాత అభ్యర్థులకు పీఈటీని నిర్వహిస్తారు.
పురుషుల ఈవెంట్స్
- 1600 మీ. పరుగు: 7 నిమిషాల 15 సెకన్లు.
- లాంగ్‌జంప్: 4 మీటర్లు.
- షాట్‌పుట్: 6 మీటర్లు. (7.26 కి.గ్రా.)
- అభ్యర్థులు ఈ ఈవెంట్లలో కచ్చితంగా అర్హత సాధించాలి.
మహిళల ఈవెంట్స్
- 800 మీ. పరుగు: 5 ని. 20 సెకన్లు.
- లాంగ్‌జంప్: 2.50 మీటర్లు.
- షాట్‌పుట్: 4 మీటర్లు (4 కేజీలు)
- అభ్యర్థులు ఈ ఈవెంట్లలో కచ్చితంగా అర్హత సాధించాలి.
1600 మీటర్ల పరుగు:
ఇది ప్రాక్టీస్ చేసే సమయంలో1600 మీటర్లు మాత్రమే పరుగెత్తకుండా ముందుగా ప్రతిరోజూ 2 నుంచి -5 కి.మీటర్లు పరుగెత్తాలి. ఇలా 15- నుంచి 20 రోజులు చేసిన తర్వాత 200 మీ., 400 మీ., 600 మీ., 800 మీ., 1000 మీ., 1200 మీ. క్రమంగా పెంచుకుంటూ సాధన చేయాలి.