ఎస్ఐ, కానిస్టేబుల్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ పార్ట్ 2 అప్లికేషన్లు దరఖాస్తు చేయటం తప్పనిసరి. ఈ సందర్భంగా అభ్యర్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి… ఏమేం సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలనేది కూడా అత్యంత కీలకం..
ఈనెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నవంబరు 10వ తేదీ రాత్రి 10 గంటల వరకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ (TSLPRB) వెబ్‌సైట్‌లో ఈ అప్లికేషన్లు నమోదు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గడువును పొడగించబోమని మండలి స్పష్టం చేసింది. అందుకే అభ్యర్థులు చివరి గడువు వరకు ఆలస్యం చేయకుండా తమ అప్లికేషన్లను నమోదు చేసుకోవాలి.
ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ) / ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ)కు హాజరు కావాలంటే క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ ఆన్‌లైన్‌లో పార్ట్-2 దరఖాస్తులు సమర్పించాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు పలువురు అర్హత సాధించిన అభ్యర్థులు కూడా ఉండటంతో.. దాదాపు 2.69 లక్షల మంది పార్ట్-2 దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ దరఖాస్తుల స్వీకరణ అనంతరం పీఎంటీ, పీఈటీల వేదికలు, తేదీల గురించి అభ్యర్థులకు వెబ్‌సైట్ ద్వారా బోర్డు ఇంటిమేషన్ లెటర్లు జారీ చేస్తుంది.
అభ్యర్థులు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్
1. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా.. పదో తరగతి మెమోను అప్ లోడ్ చేయాలి.
2. ఎస్సై అభ్యర్థులు అయితే.. డిగ్రీ సర్టిఫికేట్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ అభ్యర్థులు ఇంటర్మీడియ్ మెమోను అప్ లోడ్ చేయాలి.