HomeLATESTభువనగిరి రెసిడెన్షియల్​ డిగ్రీ కాలేజీలో ఇంటిగ్రేటేడ్ ఎంఏ

భువనగిరి రెసిడెన్షియల్​ డిగ్రీ కాలేజీలో ఇంటిగ్రేటేడ్ ఎంఏ

యాదాద్రి జిల్లా భువనగిరిలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రారంభించింది. ఈ విమెన్​ డిగ్రీ కాలేజ్ లో 2022–27 విద్యా సంవత్సరానికి అయిదేండ్ల ఇంటిగ్రేటేడ్​ డిగ్రీ కోర్సు అందుబాటులో ఉంది. ఇందులో ఫస్ట్ ఇయర్​ ఇంటిగ్రేటెడ్ ఎంఏ (ఎకనామిక్స్) కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్​ విడుదలైంది. ఇంటర్​ పాసైన విద్యార్థినులందరూ ఈ కోర్సులో చేరేందుకు అర్హులవుతారు. ఎంట్రన్స్​ టెస్ట్‌ ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయి. మిలిటరీ ఎడ్యుకేషన్‌, త్రివిధ దళాల్లో ఆఫీసర్ జాబ్స్​ రిక్రూట్​మెంట్​ లక్ష్యంగా ఈ కాలేజీని ప్రత్యేకంగా నెలకొల్పారు.

అర్హత: మొత్తం 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2021-22లో ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థినులు అర్హులు. జులై 1 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు.

సెలెక్షన్: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, సైకో అనలిటికల్ టెస్ట్‌, మెడికల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు.

దరఖాస్తులు: ఆన్​లైన్​లో అక్టోబర్ 25 వరకు అప్లికేషన్లు నమోదు చేసుకోవాలి. ( ఈ రెండు రోజులే గడువుంది) అక్టోబర్ 30న ప్రవేశ పరీక్ష, ఫైన్ ఆర్ట్స్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. www.tswreis.ac.in వెబ్​సైట్​లో అప్లికేషన్​ వివరాలు ఉన్నాయి. 

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!