రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సర్వీస్ బోర్డు… దేశవ్యాప్తంగా ఆర్బీఐ బ్రాంచీల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 450 ఉద్యోగాలకు ఆన్లైన్ అప్లికేషన్లు స్వీకరిస్తోంది. డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులవుతారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్‌తో పాటు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా సెలెక్షన్ జరుగుతుంది.
ఖాళీల వివరాలు: అసిస్టెంట్ 450 పోస్టులు (హైదరాబాద్‌లో 14 ఖాళీలున్నాయి)
అర్హత: కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీ పాసైతే సరిపోతుంది. కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం ఉండాలి. సంబంధిత రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంత భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. అభ్యర్థులు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.20,700 నుంచి రూ.55700.
పరీక్ష విధానం: ప్రిలిమ్స్ ఎగ్జామ్ (ఆబ్జెక్టివ్)లో ఇంగ్లిష్ లాంగ్వేజ్(30 ప్రశ్నలు- 30 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ(35 ప్రశ్నలు- 35 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ(35 ప్రశ్నలు- 35 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.
మెయిన్ ఎగ్జామ్ (ఆబ్జెక్టివ్)లో రీజనింగ్(40 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్(40 ప్రశ్నలు- 40 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ(40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్ అవేర్నెస్(40 ప్రశ్నలు- 40 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్(40 ప్రశ్నలు- 40 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 135 నిమిషాలు.
మెయిన్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఎల్పీటీ) రాయాల్సి ఉంటుంది. పరీక్ష సంబంధిత రాష్ట్రంలోని అధికారిక భాషలో నిర్వహిస్తారు.
ఆన్లైన్ అప్లికేషన్లు: సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 4 వరకు
ప్రిలిమినరీ టెస్ట్ : అక్టోబర్ 21, 23 .
మెయిన్ ఎగ్జామ్: డిసెంబర్ 02
శాఖల వారీగా ఖాళీలు:
అహ్మదాబాద్- 13
బెంగళూరు- 58
భోపాల్- 12
భువనేశ్వర్- 19
చండీగఢ్- 21
చెన్నై- 1
గువాహటి- 26
హైదరాబాద్- 14
జైపుర్- 5
జమ్మూ- 18
కాన్పుర్, లఖ్‌నవూ- 55
కోల్‌కతా- 22
ముంబయి- 101
నాగ్‌పుర్ – 19
న్యూదిల్లీ – 28
పట్నా – 1
తిరువనంతపురం, కొచ్చి – 16
మొత్తం ఖాళీల సంఖ్య: 450.