తెలంగాణ టెట్ (TS TET) ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని విద్యాశాఖ ప్రకటించింది. పేపర్ 2తో పోలిస్తే పేపర్ 1అభ్యర్థుల అటెండెన్స్ శాతం తగ్గింది. పేపర్ 1 ఎగ్జామ్ 84.12 శాతం, పేపర్ 2కు 91.11 శాతం మంది హాజరయ్యారు. జిల్లాల వారీగా అభ్యర్థుల అటెండెన్స్ వివరాల జాబితాను రిలీజ్ చేసింది. ఈ నెల 27న టెట్ ఫలితాలు వెలువడనున్నాయి. పేపర్ 1కు సంబంధించి శ్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్ నిపుణులు తయారు చేసిన కీని ఇక్కడ యథాతథంగా అందిస్తున్నాం. అభ్యర్థులు దీనిని కేవలం తమ స్కోర్ అంచనా వేసుకునేందుకు పరిగణనలోకి తీసుకోవాలి.

Please share the pdf ‘s of telangana academy books one to 10th class