ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఎస్సీ, ఎంసీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. వీటితో పాటు సెకండ్ డిగ్రీ కోర్సుగా ఎంబీఏ చేసేందుకు జేఎన్టీయూ అవకాశం కల్పించింది. ఈ అకడమిక్ ఇయర్ నుంచి ఈ సెకండ్ డిగ్రీ అవకాశం అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే జేఎన్టీయూ అందుకు సంబంధించిన ఎంబీఏ అడ్మిషన్ల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. త్రీ ఇయర్స్ ఉండే ఈ కోర్సులో ప్రవేశాలకు సెప్టెంబర్ 30 వరకు అవకాశం కల్పించారు. ఫీజు చెల్లించడానికి అక్టోబర్ 30 తుది గడువుగా విధించారు. వివరాలకు ఎంబీఏ కాలేజీ ప్రిన్సిపాల్ లేదా 9154251963 సంప్రదించాలని వర్సిటీ అధికారులు సూచించారు. ఎంబీఏలో డాటా సైన్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ అనాలిసిస్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, బిజినెస్ ఎకనామిక్స్, లీగల్ అండ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, హ్యుమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్, మేనేజ్‌మెంట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్ వంటి ప్రత్యేక సబ్జెక్టులలో అడ్మిషన్ తీసుకోవచ్చు.
Grand test tet