బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్‌ఎస్సీ), ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్- టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ కోరుతోంది.
ఖాళీలు: మొత్తం 224 పోస్టుల్లో సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ–5, టెక్నికల్ అసిస్టెంట్–55, సైంటిఫిక్ అసిస్టెంట్–6, లైబ్రరీ అసిస్టెంట్–1, టెక్నీషియన్-బి/ డ్రాఫ్ట్స్‌మ్యాన్- బి– 142, ఫైర్‌మ్యాన్ -ఎ– 3, కుక్– 4, లైట్ వెహికల్ డ్రైవర్ ‘ఎ’ అండ్ హెవీ వెహికల్ డ్రైవర్ ‘ఎ’ – 8 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్, పని అనుభవం ఉండాలి.
సెలెక్షన్: రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.