గ్రూప్-1 అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్పీ) బిగ్ షాక్ ఇచ్చింది. 2022 ఏప్రిల్‌లో వేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ కోసం 2022 ఏప్రిల్‌లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
గతంలో రెండు సార్లు రద్దు
ఈ పరీక్షను టీఎస్పీఎస్సీ రెండు సార్లు నిర్వహించగా వివిధ కారణాలతో ఎగ్జామ్ రద్దు అయ్యింది. ఒకసారి పేపర్ లీకేజీ కారణంగా ఎగ్జామ్ క్యాన్సిల్ కాగా.. రెండవసారి పరీక్ష నిర్వహణలో సరైన నిబంధనలు పాటించలేదని తెలంగాణ హైకోర్టు పరీక్షను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. ఇటీవల అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాత 503 పోస్టులతో పాటు ఆర్థిక శాఖ అనుమతించిన కొత్త 63 పోస్టులతో కలిపి కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.