నేషనల్ లా యూనివర్సిటీల కన్సార్టియం దేశవ్యాప్తంగా 22 లా యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్స్ కు కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్ 2023)కు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇంటర్ అర్హతతోనే న్యాయ విద్యలో అడుగుపెట్టే అవకాశం, వృత్తి నైపుణ్యాలు అందించే నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశానికి నిర్వహించే క్లాట్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే.. ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులకు దీటుగా కెరీర్‌లో రాణించే అవకాశం ఉంది. యూజీ, పీజీ పరీక్షల సెలెక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకుందాం..
అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)
అర్హత: జనరల్ అభ్యర్థులు కనీసం 45% మార్కులతో ఇంటర్మీడియట్(10+2)/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 40 శాతం మార్కులు రావాలి, మార్చి/ ఏప్రిల్ 2022లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులే. గరిష్ట వయోపరిమితి లేదు.
సిలబస్: అండర్ గ్రాడ్యుయేట్స్ కోసం నిర్వహించే ఎగ్జామ్ 150 మార్కులకు ఉంటుంది. దీన్ని ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 28 నుంచి 32 ప్రశ్నలు; జీకే అండ్ కరెంట్ అఫైర్స్35 నుంచి 39 ప్రశ్నలు; లీగల్ రీజనింగ్ 35 నుంచి 39 ప్రశ్నలు; లాజికల్ రీజనింగ్ 28 నుంచి 32 ప్రశ్నలు; క్వాంటిటేటివ్ టెక్నిక్స్ 13 నుంచి 17 ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్షకు రెండు గంటల సమయం ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్, కరెంట్ అఫైర్స్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్‌లలో పూర్తిగా ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలే అడుగుతారు. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ విభాగంలోనూ గ్రాఫ్, టేబుల్స్, డయాగ్రమ్స్ ఆధారిత ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.