Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​ అంతర్జాతీయం (మార్చి 2‌‌020)

కరెంట్​ అఫైర్స్​ అంతర్జాతీయం (మార్చి 2‌‌020)

Current Affairs World March 2020

ఇంటర్నేషనల్‌

తాలిబాన్లతో అమెరికా ఒప్పందం                             

ఆల్‌ఖైదా లక్ష్యంగా ఆఫ్గనిస్తాన్‌లో అమెరికా చేపట్టిన మిలిటరీ కార్యక్రమాలకు విరమించుకునేందుకు ఫిబ్రవరి 29న ఒప్పందం కుదిరింది.ఈ మేరకు వచ్చే 14 నెలల్లోగా అమెరికా సైన్యాలు పూర్తిగా వైదొలగనున్నాయి. తాలిబాన్ ప్రతినిధి ముల్లా అబ్దుల్ గని బర్దార్, అమెరికా ప్రతినిధి మైకెల్ రిచర్డ్‌ పాంపియో, ఆఫ్గనిస్తాన్ ప్రతినిధి జల్మౌ ఖలిజాద్  చర్చలు జరిపారు.2001 సెప్టెంబర్ 11న మొదలైన సైనిక చర్య సుమారు 18 సంవత్సరాలు పాటు కొనసాగింది. 

మయన్మార్ అధ్యక్షుడి భారత పర్యటన

మయన్మార్ అధ్యక్షుడు యువ్విన్ మింటీ, అతని భార్య డౌచిచోతో కలిసి ఫిబ్రవరి 26 నుంచి 29 వరకు భారత్‌లో పర్యటించారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్​ హౌస్ వేదికగా ప్రధాని మోడీతో చర్చలు జరిపారు. రోహింగ్యాల అహింసను నిరోధించడం. కలప అక్రమ రవాణా అరికట్టడం, గృహ, వైద్య, రంగాలలో సహకారం, పులులు సంరక్షణ, వంటి పలు ఒప్పందాలపై అవగాహనకు వచ్చారు.

ప్రపంచకప్‌ ఆర్చరీ పోటీకి జ్యోతి సురేఖ

టర్కీలోని అంటాల్కాలో మే 11 నుంచి 17వరకు జరగనున్న ప్రపంచ కప్‌ ఆర్చరీ పోటీల్లో తెలుగు క్రీడాకారిణి జ్యోతి సురేఖ కాంపౌండ్ విభాగంతో భారత్ తరుపున బరిలోకి దిగనుంది.  ప్రపంచకప్‌లలో పాల్గొనే  ఇండియా టీమ్‌  మార్చి 2న హర్యానాలో సెలక్షన్స్‌ నిర్వహించారు.  సెలెక్షన్ ట్రయల్స్‌లో 12/12 పాయింట్లతో సురేఖ నంబర్‌వనగా నిలిచి చోటు సంపాదించింది.

లక్సంబర్గ్‌లో ఉచిత రవాణా

ఐరోపా దేశమైన లక్సంబర్గ్‌లో ఫిబ్రవరి 29 నుంచి ఉచిత రవాణా విధానాన్ని ప్రవేశపెట్టారు.  దీంతో ప్రపంచంలో ఉచిత ప్రజా రవాణాను అమల్లోకి తెచ్చిన తొలి దేశంగా లక్సంబర్గ్ నిలిచింది. వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు 2018, డిసెంబర్ 6న లక్సంబర్గ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

శ్రీలంక పార్లమెంట్ రద్దు

మార్చి 2న శ్రీలంక పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు గొతబయ రాజపక్స ప్రకటించారు.  2020, ఏప్రిల్ 25న పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. మే 14న  కొత్త పార్లమెంటు సమావేశం కానుంది. పాలన సమయం మరో 6నెలు ఉండగానే రద్దు నిర్ణయం తీసుకున్నారు.

ఇండియా ర్యాంకు 46

ఇంటర్నెట్ లభ్యత, వినియోగించే స్వతంత్రత ఆధారంగా 100 దేశాలను పరిగణలోకి తీసుకొని ఎకనమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ మార్చి 6న విడుదల చేసిన ఇంక్లూజివ్ ఇంటర్నెట్ సూచీలో స్వీడన్‌ మొదటిస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ రెండు, యూఎస్‌ఏ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ నివేదికలో ఇండియాకు 46వ ర్యాంకు దక్కింది. టర్కీ సైతం ఇండియాతో పాటు 46వ స్థానంలో నిలిచింది. ఇందులో బురుండి 100వ ర్యాంకులో ఉండగా, లైబీరియా 99, మడగాస్కర్ 98వ ర్యాంకులో ఉన్నాయి. లభ్యత, సరసమైన ధర, ఔచిత్యం, సంసిద్ధత అనే 4 కేటగిరీల ఆధారంగా 56 ఇండికేటర్స్ ఉపయోగించి ఈ రిపోర్ట్‌ను రూపొందించారు.

లింగ సామాజిక సూచీ

మహిళల పట్ల పక్షపాతం, సామాజిక కట్టుబాట్ల ఆధారంగా యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం తొలిసారిగా లింగ సామాజిక నిబంధనల సూచీని తీసుకొచ్చింది. ప్రపంచంలో 80శాతం జనాభా కలిగిన 75 దేశాలను పరిగణలోకి తీసుకుని  ఈ నివేదికను రూపొందించింది. ఇందులో పాకిస్థాన్‌ తొలి ర్యాంక్‌తో అత్యధిక వివక్ష కలిగిన దేశంగా నిలిచింది . ఖతార్, నైజీరియా, జింబాబ్వే తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అండోర్రా, స్వీడన్, నెదర్లాండ్ దేశాలు అతి తక్కువ వివక్ష కలిగిన దేశాలుగా నిలిచాయి.

న్యూయార్క్ నెంబర్ వన్

స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ మార్చి 5న  విడుదల చేసిన వెల్త్ రిపోర్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపద కలిగిన నగరంగా న్యూయార్క్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. లండన్ సెకండ్, పారిస్ థర్డ్ ప్లేస్‌లో ఉన్నాయి. ఇండియా నుంచి ముంబయి 44వ ర్యాంకు, ఢిల్లీ 58, బెంగళూరు 89వ ర్యాంకులో ఉన్నాయి.

మాజీ సెక్రటరీ జనరల్ మృతి

మార్చి 4న ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ జేవియర్ పెరెజ్ డి క్యూలర్ పెరూ రాజధాని లిమాలో మరణించారు. ఈయన 1982 నుంచి 1991 వరకు యూఎన్‌ఓ సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించారు. ఈయన కాలంలో ఇరాన్–ఇరాక్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 2000 నుంచి 2001 వరకు పెరూ ప్రధానిగా కొనసాగారు.

ఉక్రెయిన్‌కు కొత్త ప్రధాని

ఉక్రెయిన్ నూతన ప్రధానిగా పశ్చిమ ఉక్రెయిన్‌కు చెందిన మాజీ అధికారి, వ్యాపారవేత్త డెనిస్ ష్మిగల్‌ మార్చి 4న ప్రమాణస్వీకారం చేశారు. జనవరిలో రాజీనామా చేసిన ఒలెక్సి హంకారుక్ స్థానంలో ఈ నియామకం జరిగింది. ఈయన ప్రధానిగా కేవలం ఆరునెలల కన్నా తక్కువ కాలం పాటు కొనసాగడం విశేషం.

అఫ్గన్‌లో రాజకీయ సంక్షోభం

మార్చి 9న ఆష్రఫ్ ఘనీతో పాటు, తిరుగుబాటు నేత అబ్దుల్లా అబ్దుల్లా ఆ దేశ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం రాజకీయ సంక్షోభానికి తెరతీసింది. 2018 సెప్టెంబర్ 28న జరిగిన అప్గనిస్థాన్ ఎన్నికల ఫలితాలు 2020 ఫిబ్రవరిలో వెలువడగా జాతీయ సంకీర్ణం నుంచి పోటీ చేసిన ఆ దేశ మాజీ సీఈవో అబ్దుల్లా అబ్దుల్లాకు 39.52శాతం ఓట్లు లభించగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన అష్రఫ్ ఘనీకి 50.64శాతం ఓట్లతో రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

బంగబంధు ఉత్సవాలు

భారత ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 17న బంగ్లాదేశ్ జాతిపిత, బంగబంధు షేక్ ముజిబుర్ రహమాన్‌కు న్యూఢిల్లీలో నివాళులర్పించారు. అనంతరం 100 ఏళ్ల జయంతి ఉత్సవాల ప్రారంభ వేడుకలలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నాడు. కరోనా వైరస్ కారణంగా ఎటువంటి బహిరంగ సభలు లేకుండా ఢాకాలోని నేషనల్ పరేడ్ గ్రౌండ్‌లో శత జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. షేక్ ముజిబుర్ రెహ్మాన్ బంగ్లాదేశ్ మొదటి అధ్యక్షుడిగా 1971 ఏప్రిల్ 17 నుంచి 1975 ఆగస్టు 15 న హత్య అయ్యే వరకు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా పనిచేశారు. 2020 ఏప్రిల్ 17 నాటికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నెలరోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు.

సార్క్ అత్యవసర నిధి

కరోనా( కోవిడ్–19) వైరస్‌ నియంత్రణ కోసం సార్క్(సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కో ఆపరేషన్) దేశాల కోసం ఒక ప్రత్యేక అత్యవసర నిధి ఏర్పాటును ప్రధాని మోడీ ప్రతిపాదించారు. ఈ నిధికి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలంటూ భారత్ తరఫున 10 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు. ఏదైనా దేశం కోరితే డాక్టర్లు, నర్సులతో పాటు వ్యాధి నిర్ధారించే కిట్లను ఉచితంగా పంపడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు కేంద్రం ప్రకటించింది.

వెలిగిన ఒలింపిక్ జ్యోతి

ఒలింపిక్స్‌కు సంబంధించి టార్చ్ రిలే మార్చి 12న జపాన్‌లోని టోక్యోలో ప్రారంభమైంది. గ్రీకు నటి జాంతి జార్జియో జ్యోతిని వెలిగించగా రియో ఒలింపిక్స్ షూటింగ్ గోల్డ్ మెడల్ విజేత అన్నా కొరాకకి మొదటి జ్యోతిని అందుకున్నారు. 2020 జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యో ఒలింపిక్స్ నిర్వహించనున్నారు. జపాన్ 1964లో ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది.

కొత్త కీటక జాతి

నికరాగ్వా దేశంలోని ఫసిఫిక్ తీరంలో కైకియా(kiakaia gaga) గాగా అనే కొత్త కీటక జాతిని కనుగొన్నారు. ఇవి చెట్ల కొమ్మలను కంపించడం ద్వారా ఒకదానికొకటి పాడతాయి. చెట్ల కొమ్మలపై నివసిస్తాయి. ఈ బగ్‌కు పేరు పెట్టే బాధ్యత ఇల్లినాయిస్ యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థి బ్రెండన్ మోరిస్‌కు అప్పగించగా అతను ప్రముఖ లేడీ పాప్ సింగర్ లేడీ గాగాకు నివాళిగా ‘కైకియా గాగా’ పేరును సూచించారు.

ఆర్థిక స్వాతంత్ర్య సూచీ

సమన్యాయం, ఆస్తి హక్కులు, ప్రభుత్వ సమగ్రత, న్యాయ విభాగం పనితీరు, పన్నులతీరు, ఆర్థికవ్యవస్థ స్థితిగతులు, నియంత్రణ సమర్థత, కార్మిక స్వేచ్ఛ, వ్యాపార, పెట్టుబడుల రంగాలలో స్వేచ్ఛాయుత వాతావరణం వంటి 12 అంశాల ఆధారంగా హెరిటేజ్ ఫౌండేషన్ రూపొందించిన ‘ఆర్థిక స్వాతంత్ర్య సూచీ’లో సింగపూర్ 89.4 స్కోర్‌‌తో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. హాంకాంగ్ సెకండ్, న్యూజిలాండ్ థర్డ్‌ ప్లేసులలో ఉన్నాయి. 186 దేశాలతో రూపొందించిన ఈ సర్వేలో ఉత్తర కొరియా చివరిస్థానంలో ఉంది. అసమగ్ర సమాచారం ఆధారంగా ఇరాక్, లిబియా, సోమాలియా, సిరియా, యెమన్‌లకు ర్యాంకులు ప్రకటించలేదు. ఈ నివేదికలో 56.5 స్కోర్‌‌తో ఇండియా 120వ స్థానంలో ఉంది. ఆసియా ఫసిఫిక్ లోని 42 దేశాలలో ఇండియాకు 28వ స్థానం దక్కింది.

ప్రపంచ సంతోష సూచీ

స్థూల దేశియోత్పత్తి, ఆయు:ప్రమాణం, దాతృత్వం, సామాజిక మద్దతు, స్వతంత్ర్యం, అవినీతి అంశాల ఆధారంగా ఐక్యరాజ్యసమితి రూపొందించిన ప్రపంచ సంతోష సూచీలో ఫిన్లాండ్ వరుసగా మూడోసారి తొలిస్థానంలో నిలిచింది. డెన్మార్క్ రెండు, స్విట్జర్లాండ్ మూడో స్థానంలో ఉన్నాయి. ఇండియా 3.573 స్కోరుతో 144వ స్థానంలో ఉంది. 2.567 స్కోరుతో అప్గనిస్థాన్ చివరగా 153వ స్థానంలో ఉంది.

బెల్జియంతో ఒప్పందం

మార్చి 21న భారత ప్రధాని నరేంద్ర మోడీ బెల్జియంతో చేసుకున్న నేరస్థుల అప్పగింత ఒప్పందంపై సంతకం చేసి ఆమోదించారు. పన్నుల ఎగవేత, ఉగ్రవాద కార్యకలాపాలలో 6 నెలలకు మించి ఇతరదేశాలలో శిక్షను ఎదుర్కొంటున్న నేరగాళ్లను ఇరుదేశాల మధ్య అప్పగింత ఒప్పందం ద్వారా మార్పిడి చేసుకుని స్వదేశంలో శిక్షను పూర్తి చేయిస్తాయి.

ప్రపంచ నగరాల సదస్సు

సింగపూర్ వేదికగా సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది జరగాల్సిన ప్రపంచ నగరాల సదస్సు వాయిదా పడింది. జూన్ 20 నుంచి 24 వరకు జరగాల్సిన సదస్సును జులై 5 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. ‘లివెబుల్ అండ్ సస్టెయినబుల్ సిటీస్; అడాప్టింగ్ టు ఏ డిస్‌రప్టెడ్ వరల్డ్’ థీమ్‌తో ఈ ఏడాది సదస్సు జరగనుంది.

జాబ్ రిటెన్షన్ స్కీం

కోవిడ్–19ను అరికట్టడంలో భాగంగా బ్రిటన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తూ ఉద్యోగులు పనిచేసే వీలులేకపోయినా వారికి వేతనాలు అందించాలనే ఉద్దేశంతో ‘జాబ్ రిటెన్షన్ స్కీమ్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. వేతనాలు పొందని ఉద్యోగులకు 80శాతం వేతనాలు 3 నెలలపాటు చెల్లిస్తుంది. ఇది నెలకు గరిష్టంగా 2500 పౌండ్ల వరకు ఉంటుంది.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!