స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ).. 283 గ్రూప్–బి నాన్‌గెజిటెడ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ మినిస్ట్రీ పరిధిలోని వివిధ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు–ఖాళీలు: జూనియర్ ట్రాన్స్‌లేటర్/ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్–275, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్–8
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉతీర్ణతతో పాటు ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.
వయసు: 2021 జనవరి 1 నాటికి 18–30 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: పేపర్–1(ఆబ్జెక్టివ్ టైప్), పేపర్–2(డిస్క్రిప్టివ్) ద్వారా సెలెక్షన్ ఉంటుంది. పేపర్–1లో జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లిష్ రెండు విభాగాలుంటాయి. ప్రతి విభాగం నుంచి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 100 ప్రశ్నలుంటాయి. రెండు విభాగాల్లో కలిపి మొత్తం మార్కులు 200. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది. డ్యురేషన్ 120 నిమిషాలు. పేపర్–1లో క్వాలిఫై అయిన వారికి పేపర్–2 కండక్ట్ చేస్తారు. మొత్తం 200 మార్కులకు డిస్క్రిప్టివ్ తరహా ట్రాన్స్లేషన్ అండ్ ఎస్సే పరీక్ష ఉంటుంది. డ్యురేషన్ 120 నిమిషాలు. పేపర్–1,2లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
ఫీజు: రూ.100, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/ఎక్స్ సర్వీస్మెన్లకు ఫీజు లేదు.
చివరి తేది: 2020 జులై 25 ఫీజు : 2020 జులై 27 వెబ్సైట్: www.ssc.nic.in
ఆర్సీబీలో 37 ప్రాజెక్ట్ స్టాఫ్
ఫరీదాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ(ఆర్సీబీ).. కాంట్రాక్టు ప్రాతిపదికన 37 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు: ప్రాజెక్ట్ హెడ్, సీనియర్ సైంటిస్ట్, రిసెర్చ్ కన్సల్టెంట్, డేటాబేస్ మేనేజర్, సైంటిస్ట్, డేటా క్యూరేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ ప్రోగ్రామర్ తదితరాలు; అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీటెక్/ఎమ్మెస్సీ, ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం;
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా; ఫీజు: రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళలకు రూ.1000;
చివరి తేది: 2020 జులై 18; వివరాలకు: www.rcb.res.in
సీఎంఈఆర్ఐలో 17 ప్రాజెక్ట్ స్టాఫ్
సీఎస్ఐఆర్కి చెందిన దుర్గాపూర్‌లోని సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఎంఈఆర్ఐ).. 17 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: ప్రాజెక్ట్- అసోసియేట్, ప్రాజెక్ట్ జేఆర్ఎఫ్, ప్రాజెక్ట్ అసిస్టెంట్; అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు యూజీజీ–నెట్/ గేట్‌తో పాటు పని అనుభవం; విభాగాలు: మాన్యుఫ్యాక్చరింగ్/ప్రొడక్షన్/ఇండస్ట్రియల్/మెకానికల్ తదితరాలు; సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా; ఈ–మెయిల్: temprct@cmeri.res.in;
చివరి తేది: 2020 జులై 12; వివరాలకు: www.cmeri.res.in
నిట్, వరంగల్‌లో..
వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్).. కాంట్రాక్టు ప్రాతిపదికన 3 రీసెర్చ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్‌లైన్, ఈ–మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: జూనియర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్), సీనియర్ రిసెర్చ్ ఫెలో(ఎస్ఆర్ఎఫ్), రిసెర్చ్ అసోసియేట్(ఆర్ఏ); అర్హత: సంబంధిత సబ్జెక్టు్ల్లో ఎమ్మెస్సీ, పీహెచ్డీ, గేట్/ నెట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా; ఈ–మెయిల్: satya@nitw.ac.in;
చివరి తేది: 2020 జులై 13; వివరాలకు: www.nitw.ac.in
బీఈసీఐఎల్, నోయిడాలో..
మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి చెందిన నోయిడాలోని బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్).. కాంట్రాక్టు ప్రాతిపదికన 35 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్, అకౌంట్ ఎగ్జిక్యూటివ్, సూపర్వైజర్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, క్యాషియర్ తదితరాలు; అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం; ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.250;
చివరి తేది: 2020 జులై 15. వివరాలకు: www.becil.com
ఎంఎంఆర్డీఏలో 110 పోస్టులు
మహారాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ మహా ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ).. 110 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: టెక్నీషియన్–106, ట్రైన్ ఆపరేటర్–-1, జూనియర్ ఇంజినీర్–01, ట్రాఫిక్ కంట్రోలర్–01, హెల్పర్–01; విభాగాలు: సివిల్, ఎస్&టీ, ఈ&ఎం, షంటింగ్, స్టోర్; అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ డిప్లొమా, ఐటీఐ/ ఎన్సీవీటీ/ ఎస్సీవీటీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష ద్వారా; ఫీజు: జనరల్‌కు రూ.300, ఇతరులకు రూ.150;
చివరి తేది: 2020 జులై 27; వివరాలకు: www.mmrda.maharashtra.gov.in
హెచ్ఎస్ఎల్, వైజాగ్‌లో 15 ఖాళీలు
విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్).. 15 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.పోస్టులు–ఖాళీలు: మేనేజర్–7, అసిస్టెంట్ మేనేజర్–2, మెడికల్ ఆఫీసర్–6; విభాగాలు: ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, నావల్ ఆర్కిటెక్చర్, హెచ్ఆర్; అర్హత: సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ద్వారా;
చివరితేది: 2020 జులై 21; హార్డ్ కాపీలు పంపడానికి: 2020 జులై 25; వివరాలకు: www.hslvizag.in
ఐఐపీఈలో 30 నాన్ టీచింగ్ స్టాఫ్
విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ).. 30 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్, ఆఫీసర్ ఐటీ, సీనియర్ సూపరింటెండెంట్, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ తదితరాలు; అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్టింగ్, రిటెన్/ ట్రేడ్/ కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా;
చివరి తేది: 2020 జులై 24; వివరాలకు: www.iipe.ac.in
టీఐఎఫ్ఆర్లో 28 ఖాళీలు
ముంబయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్(టీఐఎఫ్ఆర్).. 28 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: సైంటిఫిక్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, ట్రేడ్స్‌మెన్, క్లర్క్, వర్క్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ తదితరాలు; అర్హత: పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ/ బీటెక్/ఎంఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ద్వారా;
చివరి తేది: 2020 జులై 23; వివరాలకు: www.tifr.res.in
టీఐఎఫ్ఆర్, హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్).. 10 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: సైంటిఫిక్ ఆఫీసర్/అసిస్టెంట్, ఇంజినీర్, ప్రాజెక్టు సైంటిఫిక్ ఆఫీసర్/అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, క్లర్క్; అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా;
చివరి తేది: 2020 జులై 29; వివరాలకు: www.tifr.res.in
ఆర్మీ డెంటల్ కాఫ్స్-లో 43 ఆఫీసర్లు
ఇండియన్ ఆర్మీకి చెందిన ఆర్మీ డెంటల్ కార్ప్స్లో 43 షార్ట్ సర్వీస్ కంబైన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా దరఖాస్తుకు అర్హులే. అర్హత: బీడీఎస్/ఎండీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఏడాది వ్యవధి గల రొటేటరీ ఇంటర్న్‌షిప్ చేసి ఉండాలి. వయసు: 2020 డిసెంబర్ 31 నాటికి 45 ఏళ్లు మించకూడదు; సెలెక్షన్ ప్రాసెస్: నీట్(ఎండీఎస్)–2020 మార్కుల ఆధారంగా; ఫీజు: రూ.200;
చివరి తేది: 2020 జులై 30; వివరాలకు: www.joinindianarmy.nic.in