ఏపీ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సచివాలయంకు అనుబంధంగా ఉన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,896గ్రామ పశుసంవర్ధక సహాయకులు పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి షురూ అవుతుంది. దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు కొనసాగనుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఈ పరీక్ష సంబంధించిన హాల్ టికెట్లు డిసెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 31వ తేదీన ఆన్ లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. సెలక్ట్ అయిన వారికి జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు. నెలకు వేతనం రూ. 22, 460 చెల్లిస్తారు. సెలక్ట్ అయిన తర్వాత మొదటి రెండేళ్లు ప్రొబేషన్ ఉంటుంది. ప్రొబేషన్ సమయంలో రూ. 15వేలు కాన్సాలిడేషన్ చెల్లిస్తారు. ఆ తర్వాత నెల నుంచి రూ. 22, 460 జీతం ఇస్తారు.
వయస్సు: అభ్యర్థులు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: నోటిఫికేషన్ వెల్లడి అయిన తర్వాత అందులో పొందుపరుస్తారు.
జిల్లా వారీగా పోస్టుల వివరాలు..
అనంతపురం జిల్లాలో పోస్టులు: 473
చిత్తూరు జిల్లాలో పోస్టులు: 100
కర్నూలు జిల్లాలో పోస్టులు: 252
వైఎస్సార్ జిల్లాలో పోస్టులు: 210
నెల్లూరు జిల్లాలో పోస్టులు: 143
ప్రకాశం జిల్లాలో పోస్టులు: 177
గుంటూరు జిల్లాలో పోస్టులు: 229
కృష్ణా జిల్లాలో పోస్టులు: 120
పశ్చిమ గోదావరి జిల్లాలో పోస్టులు: 102
తూర్పు గోదావరి జిల్లాలో పోస్టులు: 15
విశాఖపట్నం జిల్లాలో పోస్టులు: 28
విజయనగరం జిల్లాలో పోస్టులు: 13
శ్రీకాకుళం జిల్లాలో పోస్టులు: 34