ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరేందుకు రెడీ అవుతున్న యువతకు గుడ్ న్యూస్. ఇండియన్ ఎయిర్ పోర్స్ లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దీని ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని ఫ్లయింగ్ గ్రౌండ్ డ్యూటీ, గ్రౌండ్ డ్యూటీ శాఖలో ఖాళీగా ఉన్న 317పోస్టుల రిక్రూట్ మెంట్ ఉంటుంది. దీనితో పాటు ఎన్ సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కోసం కూడా రిక్రూట్ మెంట్ జరుగుతుంది. ఎయిర్ ఫోర్స్ అధికారిక వెబ్ సైట్ afcat.cdac.in/AFCAT, careerindianairforce.cdac.in చెక్ చేసుకోవడం ద్వారా ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
ఈ దరఖాస్తులు డిసెబర్ 1, 2023 నుంచి ప్రారంభం అవుతున్నాయి. అప్లయ్ చేసుకునేందుకు చివరి తేదీ డిసెంబర్ 30. పరీక్ష తేదీ త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ కోర్సు జనవరి 2025తో ప్రారంభం అవుతుంది.
అర్హతలు:
ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ బ్రాంచీలో చేరాలంటే కనీసం 50శాతం మార్కులతో 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. ఇంటర్ లో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు తప్పనిసరిగా ఉండాలి. ఏదైనా విభాగంలో 60శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. లేదంటే బీటెక్ లో కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
జీతం :
AFCATలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ బ్రాంచీలో అధికారిగా జాయిన్ అయితే నెలకు దాదాపు రూ. 85, 372జీతం లభిస్తుంది. అయితే గ్రౌండ్ డ్యూటీలో జీతం నెలకు దాదాపు రూ. 74,872 ఉంటుంది. గ్రౌండ్ డ్యూటీ లో జీతం నెలకు రూ. 71,872 ఉంటుంది.