HomeLATESTటెట్​ క్విక్​​ రివిజన్ 2.. మార్కులు గ్యారంటీ​

టెట్​ క్విక్​​ రివిజన్ 2.. మార్కులు గ్యారంటీ​

మెరుపులు’ వెబ్​సైట్​ ద్వారా టెట్​ అభ్యర్థుల కోసం గత 75 రోజులుగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం డైలీ టెస్టులు, ప్రతి ఆదివారం గ్రాండ్​ టెస్ట్​లు, రివిజన్​ టెస్టులు, అభ్యర్థులు ఏ సమయంలోనైనా రాసుకునేందుకు వీలుగా ఎలాంటి రిజిస్ట్రేషన్​ ఫీ లేకుండా ఉచితంగా నిర్వహించాం. ఈ విధంగా ప్రతి రోజు దాదాపు 25వేలకు పైగా అభ్యర్థులు ఈ టెస్టులను సద్వినియోగం చేసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ కోచింగ్​ సెంటర్లు, ప్రభుత్వ స్టడీ సర్కిళ్లు, స్టాండర్డ్​ మెటీరియల్, తెలుగు అకాడమీ, రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల నుంచి ప్రశ్నలను సేకరించి 100 శాతం సిలబస్​ కవర్​ అయ్యే విధంగా నిర్వహించిన టెస్టుల నుంచి 80శాతం పైగా ప్రశ్నలు రేపు జరగబోయే పరీక్షలో రానున్నాయి. ఈ రోజు చివరగా సైకాలజీ క్విక్​ రివిజన్​ బిట్స్​ కూడా అందిస్తున్నాం.. తిరిగి డీఎస్సీ ప్రిపరేషన్​తో మీ ముందుకు వస్తాం.
–అందరికీ ఆల్‌ ది బెస్ట్​

శిశు వికాస దశలు

  1. జనన పూర్వ దశ– జైగోట్​ నుంచి పుట్టుక వరకు
  2. నవజాత శిశువు– పుట్టినప్పటి నుంచి 2వారాల వరకు
  3. శైశవ దశ– 2వ వారం నుంచి 2సం.లవరకు
  4. పూర్వబాల్యదశ– 3సం. నుంచి 5/6 సం.వరకు
  5. ఉత్తర బాల్యదశ– 5/6 సం. నుంచి 10/12 సం. వరకు
  6. యవ్వనారంభదశ– 10/12 నుంచి 13/14 సం. వరకు
  7. కౌమారదశ– 13/14 సం. నుంచి 18 సం. వరకు
  8. వయోజన దశ– 19 సం. నుంచి 40 సం. వరకు
  9. మధ్య వయస్సు– 40–60 సం. వరకు
  10. వృద్యాప్యం–60 సం. పైన

పెరుగుదల వికాసం

  1. శారీరక అభివృద్ది శారీరక, మానసిక, నైతిక,సాంఘీక అభివృద్ది
  2. గణాత్మకమైనది గుణాత్మకమైంది
  3. ఒక దశలో ఆగిపోతుంది జీవితాంతం కొనసాగుతుంది
  4. అనువంశికత ప్రభావం అనువంశికత, పరిసర ప్రభావం

అనువంశిక వాదులు పరిశోధనలు

  1. ఆల్​ఫోర్డ్​ –ప్రముఖ వ్యక్తుల కుటుంబాలు
  2. విన్​షిప్–​ ఎడ్వర్డ్​ వంశ వృక్షము
  3. డగ్​డేల్​ –జూక్స్​ వంశ వృక్షము
  4. గొడ్డార్డ్​– కల్లికాక్​ కుటుంబం
  5. పియర్​సన్​– హోమిని వంశం, డార్విన్​ వంశవృక్షము
  6. కెల్లాగ్​ దంపతులు– శిశువు+చింపాంజి
  7. గాల్టన్​– ఇంగ్లాండ్​లో ప్రముఖ, సాధారణ కుటుంబాలు
  8. ఫ్రీమన్–​ కవలలు, దయాదుల కుటుంబాలు

పరిసర వాదులు పరిశోధనలు

  1. న్యూమన్​ 19 జతల సమరూప కవలలు
  2. బాగ్లే పాఠశాల పరిసరాలు –శిశువికాసం
  3. వాట్సన్​ డజన్​ శిశువులు
  4. గోర్డన్​ పడవలు, జిప్సీలు నడిపే పిల్లలు
  5. ఎఫ్​ఎన్​ ప్రీమన్​ రూత్​ అండ్ మిల్ట్రెడ్​ అనే కవలలు
  6. స్కోడాక్​ పెంపుడు శిశువులు

ప్రజ్ఞా మాపనులు

  1. బీనే సైమన్​ ప్రజ్ఞా మాపని– ఆల్ఫ్రెడ్​ బీనే(54 ప్రశ్నలు)
  2. స్టాన్​ఫర్డ్​ బీనే–సైమన్​ ప్రజ్ఞా మాపని– లూయిస్​ టెర్మన్​(129 ప్రశ్నలు) సూత్రాలు
  3. ప్రజ్ఞా లబ్ది సూత్రం( విలియం స్నెర్న్​)
    I.Q‌‌= మానసిక వయస్సు/ శారీక వయస్సు× 100.
    MA/CA×100
  4. గుర్తింపు గణన సూత్రం= మొత్తం– తప్పులు/ మొత్తం×100
  5. పొదుపు గణన సూత్రం= పొదుపు ప్రయత్నాలు/ అసలు ప్రయత్నాలు×100
  6. ధారణ మాపనం= పున:స్మరించిన అంశాలు/ అభ్యసించిన మొత్తం అంశాలు×10

అభ్యసన వైకల్యాలు

  1. డిస్​ఫేసియా– వ్యాకరణ దోషాలు, సంభాషణ దోషాలు
  2. డిస్​లెక్సియా– పదాలను తప్పుగా చదవడం
  3. డిస్​గ్రాఫియా– రాసే పదాల్లో దోషాలు
  4. డిస్​కాలుక్యూలియా– గణిత సంబంధిత లోపాలు
  5. డిస్​ ఫ్రాక్రియా–చలన కౌశలాలు ఉపయోగించుటలో లోపం

వినికిడి వైకల్యం రకాలు

10db-25db సామాన్య శ్రవణ అవధి
26db–40db స్వల్ప శ్రవణ వైకల్యం
41db–55db మిత వినికిడి వైకల్యం
56db–70db మిత తీవ్ర వినికిడి వైకల్యం
71db–90db తీవ్ర వినికిడి వైకల్యం
91db పైన– అతి తీవ్ర వినికిడి వైకల్యం
merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

5 COMMENTS

  1. This app was really good for who preparing government jobs it’s helps me so much really nice app merupulu am giving ⭐⭐⭐⭐⭐ thank you so much

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!