టీఎస్ టెట్–2022 నోటిఫికేషన్లో టెట్ సర్టిఫికేట్కు లైఫ్ వ్యాలిడిటీతో పాటు బీఈడీ వారికి పేపర్ -1 రాసేందుకు అవకాశం కల్పిస్తూ కొత్త రూల్స్ తీసుకొచ్చింది విద్యాశాఖ. అయితే గతంలో బీఈడీ చేసిన వారు పేపర్–2 మాత్రమే రాసేందుకు అర్హత ఉండేది. ఇందులో బీఈడీలో వారు చదివిన మెథడాలజీ సంబంధించి కంటెంట్‌తో పాటు సైకాలజీ, లాంగ్వేజెస్ ప్రశ్నలు ఇచ్చే వారు. దీంతో వారి సిలబస్ పరిధి తక్కువ కానీ పేపర్–1లో మాత్రం 1 నుంచి 5 తరగతుల వరకు 5 సబ్జెక్టుల కంటెంట్‌తో పాటు, 5 మెథడాలజీలు, సైకాలజీ తప్పనిసరిగా చదవాల్సిందే..
- టెట్ సిలబస్‌లో సైకాలజీ సంబంధించిన పేపర్–1, పేపర్–2 దాదాపు ఒకే విధంగా ఉన్నా.. అభ్యర్థులు బీఈడీ, డీఈడీలో చదివిని సిలబస్‌లో కొంత మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా డీఈడీలోని సిలబస్ ప్రాథమిక స్థాయి విద్యార్థులనుద్దేశించి రూపొందించింది. అయితే పేపర్–1 రాసే బీఈడీ అభ్యర్థులు టెట్ సైకాలజీ సిలబస్‌ను డీఈడీ సైకాలజీకి అన్వయించుకుంటూ చదవాల్సి ఉంటుంది.
- టెట్ పేపర్2 సోషల్ స్టడీస్ రాసే అభ్యర్థులు పేపర్1 రాస్తే వారు సైన్స్‌తో పాటు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సోషల్ స్టూడెంట్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇబ్బందిగా భావిస్తారు. అలా అని వదిలిపెట్టకుండా 1 నుంచి 5వతరగతి వరకు ప్రాథమిక స్థాయి సిలబస్‌ను అర్ధం చేసుకుని ప్రాక్టీస్ చేస్తే మార్కులు సాధించవచ్చు.
- టెట్ పేపర్2 సైన్స్ రాసే అభ్యర్థులకు సైన్స్, మ్యాథ్స్ సంబంధించి 60 ప్రశ్నలు ఉంటాయి. కానీ పేపర్ –1లో సైన్స్, సోషల్ రెండింటికి కలిపి కేవలం 30 మార్కులు మాత్రమే కేటాయించారు. దీనిని అభ్యర్థులు గమనించాలి. అదే విధంగా బీఈడీ అభ్యర్థులకు ప్రాథమిక స్థాయి సిలబస్ అంటే చిన్న విషయంగా భావిస్తారు. కానీ సాధారణ స్థాయి ప్రశ్నలే కొన్ని సార్లు ఇబ్బంది పెడతాయి. తప్పనిసరిగా 1 నుంచి 5వ తరగతి వరకు గల పరిసరాల విజ్ఞానం పుస్తకాలను లైన్ టు లైన్ చదవాల్సిందే..
- తెలుగుకు సంబంధించిన వ్యాకరణ అంశాలు పేపర్ 1, పేపర్2కు ఒకే విధంగా ఉన్నా..కంటెంట్ విషయానికొస్తే తప్పనిసరిగా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నా కవి పరిచయాలు, పాఠ్యాంశ నేపథ్యాలు,సంభాషణలు, పాత్రలు చదువుకోవాలి. గతంలో 2వ తరగతి తెలుగు పాఠ్యాంశంలోనుంచి కూడా ప్రశ్నలు అడిగారు.
- బీఈడీ చేసిన అభ్యర్థులు మెథడాలజీ కి సంబంధించి.. ఈ కోర్సులో భాగంగా వారికి సంబంధించిన సబ్జెక్ట్ మెథడాలజీ మాత్రమే చదివి ఉంటారు. సోషల్ స్టడీస్ వారికి సైన్స్, మ్యాథ్స్ మెథడాలజీ తో సంబంధం ఉండదు. సైన్స్ వారికి సోషల్ మెథడాలజీ సంబంధం ఉండదు. కానీ టెట్ పేపర్–1 రాస్తే అన్ని సబ్జెక్టుల మెథడాలజీల సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. ఇది బీఈడీ అభ్యర్థులకు కొంత ఇబ్బంది కలిగించే విషయమే.. కానీ మెథడ్స్‌లో బోధన లక్ష్యాలు, పద్ధతులు, మూల్యాంకనం పలు అంశాలు అన్ని సబ్జెక్టులకు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు మూడు మెథడాలజీలను అన్వయించుకుంటూ చదివితే పెద్ద కష్టమేమి కాదు.
- ముఖ్యంగా బీఈడీ అభ్యర్థులు పేపర్–1 లేదా పేపర్–2 రెండింటిలో దేనికి ప్రిపేరవుతారో స్పష్టత ఉండాలి. ఏదైనా ఒకే పేపర్‌కు ప్రిపేరయితేనే మంచి స్కోర్ సాధించగలరు. సిలబస్ పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఇప్పుడున్న సమయంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవలేరు. రెండింటిని కలిపి చదవితే ఎందులోనూ విజయం సాధించలేరు. కాబట్టి ఏదైనా ఒక దానిపైనే దృష్టి సారించాలి. ఈ సారి పేపర్–1 రాసే అభ్యర్థుల సంఖ్య దాదాపు 3లక్షలకు పైనే ఉంటుందని అంచనా.. పోటీలో నిలవాలంటే అభ్యర్థులు తీవ్రంగా శ్రమించాల్సిందే..
Please send the material in English medium
Please send me English material pdf of all subjects of paper 1 .please add tet bits for all papers in English too we are really finding it difficult as we are not telugu medium
From last 4 five years tet not conducted, what about age groups above 35,this is a big loss for them, in CTET also age limit is not there ,why why in tstet,at least not conducting yearly , this is not fare, plz take action on this issue,
Send me all subjects pdf .
Tlsina mucchata enni sarlu pedtharoii
Be/Btech vallu kuda TET exam rayochu kadha