టీఎస్ టెట్ హాల్‌టికెట్లు రెడీ అయ్యాయి. టెట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి వీటిని డౌన్ లోడ్ చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఈనెల 15న టెట్ పరీక్ష జరుగనుంది. ఈ ఏడాది మొత్తం 2,97,055 మంది అభ్యర్థులు టెట్ పరీక్ష కు అప్లై చేసుకున్నారు. పేపర్ 1కు 2,69,557 మంది పేపర్ 2 కు 2,08,498 మంది అప్లై చేసుకున్నారు. సెప్టెంబర్ 15న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్ష జరుగుతుంది. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ముందుగా ఇక్కడున్న సూచనలను అభ్యర్థులు గమనించాలని విద్యాశాఖ ప్రకటించింది.
TSTET 2023 HALLTICKETS DOWNLOAD LINK
- హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొన్న తరువాత అందులో పొందుపరిచిన వివరాలను సరిచూసుకోండి.
- పేరులో స్వల్ప అక్షర దోషాలు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేది, కులము, లింగం (జెండర్) మరియు డిసెబులిటి (PHC) లాంటి వివరాలలో సరిగా లేనిచో పరీక్ష హాలులో “నామినల్ రోల్ కమ్ ఫోటో ఐడెంటిటీ”లో వాటిని సరిచేసుకోవలెను.
- హాల్ టికెట్లపై ఫోటో/ సంతకం సరిగా లేకపోయినా లేదా అసలు లేకపోయినా అభ్యర్థులు ఇటీవల తీయించుకున్న ఫోటోను అతికించి గెజిటెడ్ ఆఫీసర్చే అటెస్టేషన్ చేయించుకొని ఫోటో ID (ఆధార్కార్డు లేదా ఏ ఇతర ID)తో సంబంధిత జిల్లా విద్యాధిశాఖాధికారిని సంప్రదించవలెను. జిల్లా విద్యాధిశాఖాధికారి పరిశీలన అనంతరం అభ్యర్ధిని పరీక్షకు అనుమతించుటలో తగు నిర్ణయాన్ని తీసుకుంటాడు.
- హాల్ టికెట్లో ఇవ్వబడిన సూచనలన్నీ (Instructions) తప్పక చదవండి.
- అభ్యర్థులు పరీక్ష సెంటర్ మరియు వాటి చిరునామాను పరీక్షకు ముందురోజు చూసుకొని నిర్ధారించుకొనగలరు.
- మీరు కేటాయించిన సెంటర్లో మాత్రమే మిమ్మల్ని అనుమతించబడును.