Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSబీటెక్ చేసిన వారికి గుడ్ న్యూస్.. రూ.1.40 లక్షల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆ...

బీటెక్ చేసిన వారికి గుడ్ న్యూస్.. రూ.1.40 లక్షల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆ స్కోర్ ఉంటే చాలు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లోని ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న సంస్థ కార్యాలయాల్లో 596 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజగా నోటిఫికేషన్ విడుదల చేసింది AAI. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 22న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 21ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు:
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-సివిల్): 62 పోస్టులు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-ఎలక్ట్రికల్): 84 పోస్టులు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-ఎలక్ట్రానిక్స్): 440 పోస్టులు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-ఆర్కిటెక్చర్): 10 పోస్టులు
మొత్తం ఖాళీలు: 596

విద్యార్హతల వివరాలు: సంబంధిత సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు జనవరి 21 నాటికి 27 ఏళ్లలోపు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
అధికారిక వెబ్ సైట్: http://www.aai.aero/

వేతనాలు: ఎంపికైన వారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.1.40 లక్షల వేతనం ఉంటుంది.

అభ్యర్థుల ఎంపిక: గేట్ 2020/21/22 స్కోర్ తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!