టీఎస్పీఎస్సీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 7వ తేదీన నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 9655 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా.. అందులో 9368 మంది అభ్యర్థుల మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ త్వరలోనే ఉంటుందని.. 1:2 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేసి తదుపరి సెలెక్షన్ జాబితా విడుదల చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటనలు జారీ చేసింది. మెరిట్ లిస్ట్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంది.