తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కీలక ప్రకటన చేసింది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (TSPSC Food Safety Officer Recruitment) ఉద్యోగ నియామక పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్ సైట్ (https://www.tspsc.gov.in/) నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్లు ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ పరీక్షను నవంబర్ 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12.30 నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం 02.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్నారు.
అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి 45 నిమిషాల ముందు వరకు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే.. ఆఖరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా సాధ్యమైనంత ముందుగా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు సూచించింది. హాల్ టికెట్ మీద పేర్కొన్న నిబంధనలు పాటించాలని అభ్యర్థులకు తెలిపింది.
హాల్ టికెట్స్ డౌన్ లోడ్ డైరెక్ట్ లింక్-LINK