Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటీఎస్​పీఎస్​సీ ఆఫీసులోనే నిందితుల అడ్డా..? ఎవరెవరు అరెస్టయ్యారు.. ఇదిగో జాబితా

టీఎస్​పీఎస్​సీ ఆఫీసులోనే నిందితుల అడ్డా..? ఎవరెవరు అరెస్టయ్యారు.. ఇదిగో జాబితా

టీఎస్​పీఎస్​సీ పేపర్ల లీకేజీ (TSPSC PAPER LEAKAGE) వ్యవహరం తీగ లాగితే.. డొంకంతా కదిలినట్లు రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. ఇప్పటివరకు సిట్​ దర్యాప్తులో విస్మయపరిచే నిజాలు బయటపడ్డాయి. టీఎస్​పీఎస్​సీ ఆఫీసులో మొత్తం 165 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆఫీసులో పని చేస్తున్న వారిలో 26 మంది గ్రూప్​​ 1 (TSPSC GROUP 1) పరీక్షకు అటెండయ్యారు. వీరిలో 8 మంది ప్రిలిమ్స్​ క్వాలిఫై అయ్యారు. అందులో ఇద్దరికి 120కిపైగా మార్కులు వచ్చినట్లు సిట్​ దర్యాప్తులో తాజాగా బయటపడింది.

Advertisement

క్వాలిఫై అయిన వారితో పాటు 12 మంది నాట్ క్వాలిఫై జాబితాలో ఉన్నారు.​ ప్రధాన నిందితుడు ప్రవీణ్​తో పాటు నాట్ క్వాలిఫై అయిన వారిలోనే వంద మార్కులకుపైగా వచ్చిన వారున్నారు. వారికి సంబంధించిన ఓఎంఆర్​ షీట్లు డబుల్​ బబ్లింగ్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇదంతా పక్కా ప్లాన్​ ప్రకారం జరిగిందనే అనుమానాలకు తెరలేపింది. దీంతో టీఎస్​పీఎస్​సీ లోని ఉద్యోగులందరూ రింగయ్యారా.. అందరూ కలిసి కట్టుగానే గ్రూప్​ 1 పేపర్​ లీక్​ చేశారా.. అనే కోణంలో సిట్​ దర్యాప్తు వేగవంతం చేసింది.

టీఎస్​పీఎస్​సీ సెక్రెటరీ దగ్గర పని చేసే పీఎస్​ సహా 26 మంది ఉద్యోగులను గ్రూప్​ 1 పరీక్ష రాసేందుకు ఎవరు అనుమతించారు.. వీరందరూ పరీక్ష రాసేందుకు ముందు విధిగా తీసుకోవాల్సిన నో ఆబ్ఝక్షన్​ సర్టిఫికెట్​ తీసుకున్నారా..? పరీక్ష రాసే ఉద్యోగులు ఎన్ని రోజుల ముందు సెలవు పెట్టారు..? టీఎస్​పీఎస్​సీలో అత్యంత కాన్ఫిడెన్షియల్​ గా ఉండాల్సిన ప్రశ్నాపత్రాల సెక్షన్లో పరీక్ష రాస్తున్న ఉద్యోగులు ఎందుకు పని చేస్తున్నారు..? ఈ సందేహాలన్నీ ఇన్విస్టిగేషన్​ టీమ్​ కు సైతం పరీక్ష పెట్టినట్టుగానే ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే ఈ పేపర్ (TSPSC PAPER LEAKAGE CASE)​ లీకేజీ కేసులో 12 మందిని సిట్​ (SIT) అరెస్ట్ చేసింది. అరెస్టయిన వారి జాబితా (పోలీసు రికార్డుల ప్రకారం)

01) పులిదిండి ప్రవీణ్ కుమార్ S/o లేట్ P. హరిశ్చంద్రరావు, వయస్సు 32 సంవత్సరాలు, Occ: TSPSCలో Asst సెక్షన్ ఆఫీసర్, R/o H.No. 13-108, మల్లికార్జున కాలనీ, బడంగ్‌పేట్, బాలాపూర్ (M), RR జిల్లా.

Advertisement

02) అట్ల రాజ శేఖర్ @ అట్ల రాజ శేఖర్ రెడ్డి @ రాజు S/o A. అంజి రెడ్డి, వయస్సు 35 సంవత్సరాలు, Occ: నెట్‌వర్క్ అడ్మిన్ O/o TSPSC, నాంపల్లి, హైదరాబాద్, R/o L-6 బ్లాక్, ప్లాట్ నెం 207, చిత్రపురి కాలనీ, మణికొండ, RR జిల్లా, N/o H.No. 3-14, తాటిపల్లి (వి), మల్యాల(ఎం), జగిత్యాల(డి).

03) రేణుక W/o లవ్ద్యావత్ ధాక్యా, వయస్సు: 35 సంవత్సరాలు, Occ.హిందీ టీచర్, R/o మహబూబ్‌నగర్ N/o H.No. 6-4, పగిడ్యాల్ పంచంగల్ తండా (V), గండీడ్(M), మహబూబ్ నగర్ (D).

04) లవ్ద్యావత్ ధాక్యా @ ధాక్యా, S/o కుర్మ్యా నాయక్, వయస్సు 38 సంవత్సరాలు, Occ: RD Dept @ Vikarabad, R/o H.No.లో టెక్నికల్ అసిస్టెంట్. 6-4, పగిడ్యాల్ పంచంగల్ తండా (V), గండీడ్(M), మహబూబ్ నగర్ (D).

Advertisement

05) కేతావత్ రాజేశ్వర్ @ రాజు S/o భద్రయ్య నాయక్, వయస్సు 33 సంవత్సరాలు, Occ: అగ్రిల్, R/o H.No. 5-50 మన్సూర్‌పల్లి తాండా (వి), గండీడ్(ఎం), మహబూబ్ నగర్ (డి).

06) కేతావత్ నీలేష్ నాయక్, S/o లోక్యా నాయక్, వయస్సు 28 సంవత్సరాలు, Occ: హడాప్సర్‌లో సైట్ ఇంజనీర్, పూణే, R/o H.No. 5-52, మన్సుపల్లి తాండా, గండీడ్ (M), మహబూబ్ నగర్ (D).

07) పథ్లావత్ గోపాల్ నాయక్ @ గోపాల్ S/o P. పాండు నాయక్, వయస్సు 29 సంవత్సరాలు, Occ: ప్రభుత్వ ఉద్యోగం ఆశించేవారు, R/o H.No. 4-1, పులిచర్లకుంట తండా, లగచెర్ల (వి), దుద్యాల (మ), వికారాబాద్ (డి).

Advertisement

08) కేతావత్ శ్రీనివాస్ @ శ్రీనివాస్ @ శ్రీను S/o లేట్ K. చంద్రియా నాయక్, వయస్సు 30 సంవత్సరాలు, Occ: కానిస్టేబుల్ బేరింగ్ PC. No 10108 మేడ్చల్ PS వద్ద, R/o ప్లాట్ నెం 26, సాధన స్కూల్ దగ్గర, సాయి బాబా నగర్ కాలనీ, మేడ్చల్ , N/o H.No. 5-50, మన్సూర్‌పల్లి తాండా (V), గండీడ్(M), మహబూబ్ నగర్ (D).

09) కేతావత్ రాజేందర్ నాయక్ @ రాజేందర్ S/o లోక్యా నాయక్, వయస్సు 31 సంవత్సరాలు, Occ: మాసన్ R/o ప్రస్తుత చిరునామా: హడాప్సర్, పూణే, పెర్మెనానాట్ చిరునామా: H.No. 5-52, మన్సుపల్లి తాండా, గండీడ్ (ఎం), మహబూబ్ నగర్ (డి), (నీలేష్ నాయక్ సోదరుడు).

10) షమీమ్, ( ASO సెక్షన్ ఆఫీసర్ tspsc)

11) సురేష్ (ఔట్ సోర్సింగ్ , tspsc టెక్నికల్ వింగ్ లో పని చేసి మానేశాడు)

12) రమేష్ (డేటా ఆపరేటర్ ఔట్ సోర్సింగ్ tspsc లో పనిచేస్తున్నాడు)

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!