అభ్యర్థులు ఏదైనా ఫిర్యాదు చేయాలంటే గతంలో టీఎస్పీఎస్సీ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరముండేది. ఇప్పుడు వెబ్సైట్లో మీ కంప్లైంట్ రైజ్ చేస్తే సరిపోతుంది. అందుకు సంబంధించి టీఎస్పీఎస్సీ అఫిషియల్ వెబ్సైట్లో ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఆఫ్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘RAISE A GRIEVANCE’ పేరుతో ఒక ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో అభ్యర్థులు ఎలాంటి సమస్యనైనా.. ఫిర్యాదులనైనా టీఎస్పీఎస్సీ దృష్టికి తీసుకెళ్లొచ్చు. అభ్యర్థులు తమ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను డాక్యుమెంట్ రూపంలో కూడా అప్‌లోడ్ చేసే వీలుంది.
త్వరలోనే భారీగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. లక్షలాది మంది అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశముంది. ఈ సందర్భంగా తలెత్తే సందేహాలు, సాంకేతిక సమస్యలు.. అప్లికేషన్లకు సంబంధించిన ఫిర్యాదులేమున్నా.. అభ్యర్థులు నేరుగా టీఎస్పీఎస్సీని ఆశ్రయించేందుకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. వన్‌టైం రిజిస్ట్రేషన్, దాని ఎడిట్, మొబైల్ నంబర్ మార్పు.. ఎలాంటి సమస్య తలెత్తినా ఫిర్యాదు చేయవచ్చు. పరీక్షల తర్వాత రిజల్ట్స్, వెబ్ ఆప్షన్, సెలక్షన్ ప్రోసిజర్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కోర్టు ఉత్తర్వుల అమలు, డిపార్ట్‌మెంటల్ పరీక్షలు, కొత్త ప్రకటనలు జారీ.. వీటికి సంబంధించిన అంశాలన్నీ ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసుకోవచ్చు.
ఫిర్యాదు ఎలా చేయాలి
- తమ సమస్యపై అభ్యర్థులు ఫిర్యాదు చేయాలనుకుంటే..
- టీఎస్పీఎస్సీ అఫిషియల్ వెబ్సైట్లో ‘RAISE A GRIEVANCE’ ఆప్షన్‌పై మొదట క్లిక్ చేయాలి. లేదా ఇక్కడున్న డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయండి http://igrs.tspsc.gov.in/student_grievance.aspx
- టీఎస్పీఎస్సీ ఐడీతో పాటు అభ్యర్థి పుట్టిన తేదీని నమోదు చేసి.. సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అభ్యర్థి వ్యక్తిగత వివరాలు ప్రత్యక్షమవుతాయి.
- వాటిని పరిశీలించిన తర్వాత.. అభ్యర్థి హాల్‌టికెట్ నంబర్‌తో పాటు ఫిర్యాదు చేయాలనుకున్న నోటిఫికేషన్ నంబర్, నోటిఫికేషన్ పేరు నమోదు చేయాలి.
- కేటగిరీ ఆప్షన్‌లో ఏ సమస్యపై ఫిర్యాదు చేస్తున్నారో నమోదు చేయాలి.
- ఫిర్యాదుకు సంబంధించిన పైల్‌ను అప్‌లోడ్ చేయాలి. ఫిర్యాదు ఎందుకు చేస్తున్నారో వివరాలివ్వాలి.
- తర్వాత సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయగానే.. ఫిర్యాదు నంబర్ జనరేట్ అవుతుంది. ఫిర్యాదు స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
- ఒక ఫిర్యాదుకు గరిష్ఠంగా మూడు ఫైళ్లను మాత్రమే అప్‌లోడ్ చేయాలి. అవి జేపీఈజీ, పీడీఎఫ్ ఫార్మాట్‌లోనే ఉండాలి.
- ఫిర్యాదుకు సంబంధించిన వివరణ 450 అక్షరాలకు మించకూడదు.