టీఎస్ టెట్– TS TET 2022 అప్లికేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఇప్పటికే 33 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అనుకున్నదానికంటే దరఖాస్తులు ఎక్కువగా రావడంతో ఇప్పటికే పలు జిల్లాల్లో సెంటర్లు ఎత్తేశారు. గత రెండు, మూడు రోజులుగా దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులకు వారి సొంత జిల్లా సెంటర్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. శనివారం సాయంత్రం వరకు సుమారు 4 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు.
దీంతో ఆదిలాబాద్, అసిఫాబాద్, నిజామాబాద్, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సెంటర్లను టెట్ వెబ్సైట్లో క్లోజ్ చేశారు. వీరందరూ దగ్గరలో ఉన్న మరో జిల్లా కేంద్రాన్ని ఎంపిక చేసుకోవటం తప్ప గత్యంతరం లేదు. టెట్ అప్లికేషన్ ఫీజు చెల్లించేందుకు గడువు (ఈనెల 11) రేపటితో ముగియనుంది. ఎల్లుండితో (ఈనెల 12న) టెట్ అప్లికేషన్ సబ్మిషన్ క్లోజ్ అవుతుంది. మరో లక్ష మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే అందిన విజ్ఞప్తుల మేరకు మరో వారం రోజుల పాటు దరఖాస్తుల గడువును పొడిగిస్తారని తెలుస్తోంది. చివరి సమయంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వీలైనంత మేరకు అభ్యర్థులు ఈ రోజే దరఖాస్తు చేసుకోవటం బెటర్.
టెట్ ఎగ్జామ్ సెంటర్లు బ్లాక్ చేసిన జిల్లాలు;
ఆదిలాబాద్, అసిఫాబాద్, నిజామాబాద్, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్
Adilabad centre reopen sir pz
Edit option untunda Sir.
Sir I have a new born boy he is just 10 days old.i want to write Tet but there is no exam center option in hyd n rrd plz plz plz understand my problem
Please have a exam confirmation june2
Hi sir
Nenu tet paper2 6th date ki apply chesa center peddapalli pettanu.ippudu paper 1 apply cheste center peddapally vuntada.please reply me
Bed vallaki Sgt chance undaa
Edit option untuda.
B.ed chesina vallaki paper .1 chance unda
Kani andari yenduku ivva vaddu ani antunnaru
Kachitanga ivvali sir evari talent valladi .sa chaala takkuvaga untadi
B.ed vallu paper 1 raste tappu enti..idi koncham andari alochinchale sir.
Please after 4 year …..
Also please provide many notification