
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌తో పాటు అభ్యర్థులకు అవసరమైన వివరాలు అందించేందుకు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. త్వరలో విడుదలయ్యే నోటిఫికేషన్లకు అవసరమైన సేవలను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అధికారులతో కూడిన సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్‌ను ఇచ్చేందుకు టీఎస్‌పీఎస్‌సీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త అభ్యర్థుల వివరాలను నమోదు చేసుకోవడం, ఇప్పటికే ఉన్న వివరాలను ఎడిట్ చేసుకోవడానికి వన్‌టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) సేవలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులకు మరింత మెరుగైన సేవలను అందించడం కోసం కొత్తగా కాల్‌సెంటర్‌ను ప్రారంభించారు.
టీఎస్‌పీఎస్‌సీ కి సంబంధించిన ఏ విషయాన్నైనా 040-22445566 అనే నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పనిచేయనుంది.
040- 23542185, 040-23542187 అనే ఫోన్ నంబర్లలో టెక్నికల్ టీంను కూడా సంప్రదించవచ్చు.