HomeLATESTగ్రూప్​2, గ్రూప్​3 లో అదనపు పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్​

గ్రూప్​2, గ్రూప్​3 లో అదనపు పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్​

తెలంగాణ స్టేట్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (టీఎస్‌పీఎస్సీ) ఇప్పటికే విడుదల చేసిన గ్రూప్‌-2, గ్రూప్‌- 3 నోటిఫికేషన్లలో అదనపు పోస్టులను కలిపే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గ్రూప్‌-1 మాదిరే ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ అదనపు పోస్టులు కలపాలని ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

పెరిగిన పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్​

2022 గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో కటాఫ్‌ తేదీ ప్రకారం 18 విభాగాల్లో 783 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు పెరిగిన పోస్టులతో టీఎస్పీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నదని తెలిసింది. 2022 డిసెంబర్‌ 30న విడుదలైన గ్రూప్‌ -3 అదనపు ఖాళీ పోస్టులు కలుపుకొని అనుబంధ నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. కాగా గ్రూప్‌-3లో ప్రస్తుతం 1375 ఖాళీలు ఉన్నాయి. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ టార్గెట్​గా పెట్టుకున్న సర్కార్​ త్వరలోనే ఈ నోటిఫికేషన్లు ఇవ్వనుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!