సింగరేణి సంస్థ నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. 485 ఉద్యోగాల భర్తీకి యాజమాన్యం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి సీఅండ్ఎండీకి బుధవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చెప్పిన విధంగానే సింగరేణి యాజమాన్యం నోటిఫికేషన్లు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్
నోటిఫికేషన్లో ఎగ్జిక్యూట్ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (మైనింగ్), ఈ 2 గ్రేడ్ 139 పోస్టులు, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎఫ్అండ్ఏ) ఈ 2 గ్రేడ్ 22 పోస్టులు, మేనేజ్‌మెంట్ ట్రైనీ (పర్సనల్) ఈ 2 గ్రేడ్ 22 పోస్టులు, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఐఈ) ఈ 2 గ్రేడ్ 10 పోస్టులు, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్, ఈ 1 గ్రేడ్ 10 పోస్టులు, మేనేజ్‌మెంట్ ట్రైనీ (హైడ్రో జియాలజిస్టు) ఈ 2 గ్రేడ్ 2 పోస్టులు, మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్) ఈ 2 గ్రేడ్ 18 పోస్టులు, జూనియర్ ఫారెస్టు ఆఫీసర్ ఈ 1 గ్రేడ్ 3 పోస్టులు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఈ 3 గ్రేడ్ 30 పోస్టులు ఉన్నాయి. ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో సబ్ ఓవర్సీర్ ట్రైనీ, టీఅండ్ఎస్ గ్రేడ్ సీలో 16 పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 1 మధ్యాహ్నం 12 గంటల నుంచి వెబ్‌సైట్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ మార్చి 18 అని వెల్లడించారు. పూర్తి వివరాలు www.scclmines.com మార్చి 1 నుంచి వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని యాజమాన్యం తెలిపింది.