HomeLATESTగ్రూప్​ 4 కీ విడుదల ఎప్పుడంటే.. టీఎస్​పీఎస్​సీ అప్​డేట్

గ్రూప్​ 4 కీ విడుదల ఎప్పుడంటే.. టీఎస్​పీఎస్​సీ అప్​డేట్

ఇటీవల జరిగిన గ్రూప్​ 4 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీ ఎప్పుడు విడుదలవుతుందని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అందుకు సంబంధించి టీఎస్​పీఎస్​సీ కసరత్తు చేస్తోంది. తెలంగాణలో జులై 1వ తేదీన టీఎస్​పీఎస్​సీ గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 8180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించిన ఈ పరీక్షకు 9.12 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వీరిలో దాదాపు 80 శాతం మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు టీఎస్​పీఎస్​సీ ప్రకటించింది. 7,62,872 మంది అభ్యర్థులు పేపర్​ 1 పరీక్షకు అటెండయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్​ 2కు 7.61,198 మంది హాజరయ్యారు.

Advertisement

పరీక్ష ముగిసి ఇప్పటికే 12 రోజులైంది. దీంతో ప్రైమరీ కీ ఎప్పుడు విడుదల అవుతుంది? అని గ్రూప్​ 4 రాసిన అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే.. గ్రూప్​ 1 ప్రిలిమినరీ పరీక్ష తరహాలోనే పరీక్ష జరిగిన తర్వాత 15 రోజులకు ప్రైమరీ కీ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈనెల 16 లేదా 17వ తేదీన గ్రూప్​ 4 ప్రైమరీ కీని విడుదల చేసే అవకాశాలున్నాయని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. కానీ.. ఓఎంఆర్ షీట్ల స్కానింగ్​ ఇంకా పూర్తి కాకపోవటంతో టీఎస్​పీఎస్​సీ కీ విడుదల తేదీలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

గ్రూప్​ 4 పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం, రెండు (పేపర్​ 1, పేపర్​ 2) పేపర్లు ఉండటంతో ఓఎంఆర్​ షీట్ల స్కానింగ్​ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కనీసం మరో నాలుగయిదు వారాలు పట్టే అవకాశముంది. అప్పటిదాకా ప్రైమరీ కీ విడుదల చేయాలా.. వద్దా.. అనే విషయంలో బోర్డు ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. ముందుగా.. ప్రైమరీ కీ ని విడుదల చేసి.. తర్వాత ఓఎంఆర్​ షీట్లను ఆన్​లైన్​లో పెట్టే ప్రతిపాదనలను కూడా టీఎస్​పీఎస్​సీ పరిశీలిస్తోంది. ఒకవేళ ఓఎంఆర్​ షీట్లతోనే ప్రైమరీ కీని విడుదల చేయాలనుకుంటే మరింత ఆలస్యమవటం ఖాయం. ఓఎంఆర్​ పూర్తయిన తర్వాతే కీ విడుదల చేయాలని టీఎస్​పీఎస్​సీ నిర్ణయం తీసుకుంటే.. ఆగస్ట్ నెలాఖరు వరకు అభ్యర్థులు వెయిట్​ చేయక తప్పదు. కీ విడుదల చేసిన తర్వాత.. అభ్యంతరాల స్వీకరణకు కొంత గడువు ఇచ్చి ఫైనల్​ కీతొ పాటు టీఎస్​పీఎస్​సీ ఫలితాలను విడుదల చేస్తుంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!