HomeLATESTఎంసెట్​(బైపీసీ), ఈసెట్​, ఐసెట్​ అడ్మిషన్ల షెడ్యూల్​

ఎంసెట్​(బైపీసీ), ఈసెట్​, ఐసెట్​ అడ్మిషన్ల షెడ్యూల్​

తెలంగాణలో ఎంసెట్ (బైపీసీ), ఐసెట్, ఈసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది.

Advertisement

ఎంసెట్ బైపీసీ స్టూడెంట్లకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
బీఫార్మసీ, ఫార్మాడీ, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎంసెట్ (బైపీసీ)–2023 అడ్మిషన్ల షెడ్యూల్​ను విద్యాశాఖ సెక్రెటరీ వాకాటి కరుణ రిలీజ్ చేశారు.

సెప్టెంబర్ 2న ప్రారంభం కానున్న అడ్మిషన్ల ప్రక్రియ అదేనెల 26తో ముగియనున్నది. ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియ లో భాగంగా సెప్టెంబర్ 2,3 తేదీల్లో రిజిస్ర్టేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఇదే సమయంలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. 4,5 తేదీల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. సెప్టెంబర్ 4 నుంచి 7 వరకూ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది. సెప్టెంబర్ 11న సీట్ల అలాట్‌మెంట్ ఉంటుంది. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ 17 నుంచి 26 వరకూ ఉంటుంది.

ఈసెట్ కౌన్సెలింగ్ 29 నుంచి…
బీటెక్, బీఫార్మసీ తదితర కోర్సుల్లో లాటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్​ లో చేరేందుకు నిర్వహించే ఈసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ రిలీజైంది. ఆన్​లైన్​ రిజిస్ర్టేషన్, పేమెంట్ ప్రాసెస్ ప్రక్రియ ఈనెల 29 నుంచి ఆగస్టు1 వరకూ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈనెల 31 నుంచి ఆగస్టు 3 వరకూ ఉంటుంది. 31 నుంచి ఆగస్టు 4 వరకూ వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆగస్టు 8న ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఆగస్టు 20 నుంచి 30 వరకూ ఉంటుంది.

========
వచ్చేనెల 14 నుంచి ఐసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం వచ్చేనెలలో కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నది. ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 9 వరకూ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ రిజిస్ర్టేషన్లు, స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఆగస్టు 14 నుంచి 18 వరకూ ఉంటుంది. 16 నుంచి 19 వరకూ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఆగస్టు 16 నుంచి 21 వరకూ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉండనుండగా, 25న సీట్ల కేటాయింపు చేయనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ కొనసాగనున్నది.

Advertisement

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!