HomeLATESTరెండు రోజుల్లో గ్రూప్​ 4 ఫైనల్​ కీ.. తుది ఫలితాలపై క్లారిటీ

రెండు రోజుల్లో గ్రూప్​ 4 ఫైనల్​ కీ.. తుది ఫలితాలపై క్లారిటీ

గ్రూప్-4 ఫైనల్​ కీ (TSPSC GROUP 4 FINAL KEY) ఒకటీ రెండు రోజుల్లో వెలువడనుంది. ఆగస్ట్ 28వ తేదీన టీఎస్పీఎస్సీ గ్రూప్​ 4 ప్రైమరీ కీని విడుదల చేసింది. సెప్టెంబర్​ 4వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించింది. మొత్తం 8180 గ్రూప్-4 పోస్టులకు 7.61 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ప్రిలిమినరీ కీతో పాటు పేపర్​ 1, పేపర్​ 2 ఓఎంఆర్ షీట్లను టీఎస్​పీఎస్​సీ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచింది. జులై 1వ తేదీన టీఎస్​పీఎస్​సీ గ్రూప్-4 పరీక్ష జరిగింది.

Advertisement

పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం, రెండు (పేపర్​ 1, పేపర్​ 2) పేపర్లు ఉండటంతో ఓఎంఆర్​ షీట్ల స్కానింగ్​ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టింది. దీంతో పరీక్ష జరిగిన తర్వాత దాదాపు రెండు నెలల వ్యవధి తర్వాత టీఎస్​పీఎస్​సీ ప్రైమరీ కీ రిలీజ్​ చేసింది. దీనిపై అభ్యంతరాలు స్వీకరఱ పూర్తయి నెల రోజులైంది. అభ్యంతరాల పరిశీలన ఇటీవలే పూర్తయిందని టీఎస్​పీఎస్​సీ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో ఒకటీ రెండు రోజుల్లోనే ఫైనల్​ కీ విడుదలయ్యే అవకాశాలున్నాయి. అక్టోబర్​ 6, లేదా 7 తేదీల్లో ఫైనల్​ కీ రిలీజ్​ అవుతుందని అధికారులు సూచనప్రాయంగా వెల్లడించారు. ఫైనల్​ కీ తర్వాత తుది ఫలితాలు ఇవ్వటానికి మరి కొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఫైనల్​ కీ విడుదలైన తర్వాత.. వారం రోజులకు జనరల్​ ర్యాంకింగ్​ లిస్ట్ ను టీఎస్​పీఎస్​సీ విడుదల చేస్తోంది. ఆ తర్వాతే సెలక్షన్​ లిస్ట్ ప్రకటించనుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!