HomeLATESTనవంబర్​ 2, 3 తేదీల్లో గ్రూప్​ 2

నవంబర్​ 2, 3 తేదీల్లో గ్రూప్​ 2

వాయిదా పడ్డ గ్రూప్​ 2 (TSPSC GROUP 2 Exam) పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. సీఎం సూచనల మేరకు టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 2 పరీక్షలను రీషెడ్యూల్​ చేసింది. లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళనకు దిగటం, ప్రభుత్వం జోక్యం చేసుకోవటంతో ఆగస్ట్ 29, 30వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను టీఎస్​పీఎస్​సీ వాయిదా వేసింది. తిరిగి నవంబర్​ 2, 3 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్​పీఎస్​సీ ప్రకటన విడుదల చేసింది. 2వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్​ 1, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పేపర్​ 2, 3వ తేదీన ఉదయం పేపర్​ 3, మధ్యాహ్నం పేపర్​ 4 నిర్వహిస్తారు. పరీక్షకు వారం రోజుల ముందు టీఎస్​పీఎస్​సీ వెబ్​సైట్​లో హాల్​ టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపింది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!