పేపర్ లీకేజీ కారణంగా వాయిదా పడిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సిస్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాత పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ (TSPSC) తాజాగా ప్రకటించింది. జులై 08వ తేదీన టీపీబీఓ రాత పరీక్ష ఉంటుందని తెలిపింది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు రాత పరీక్షను జులై 13, 14వ తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించి రాత పరీక్షను ఆన్ లైన్ (సీబీఆర్టీ) విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఇంకా.. హాల్ టికెట్స్ విడుదలపై కూడా టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది. పూర్తి వివరాలకు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించింది.
Chandra Mohan