Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsవదంతులు నమ్మకండి... పారదర్శకంగా ప్రిలిమినరీ కీ విడుదల చేస్తాం: TSLPRB

వదంతులు నమ్మకండి… పారదర్శకంగా ప్రిలిమినరీ కీ విడుదల చేస్తాం: TSLPRB

కానిస్టేబుల్​ ఎగ్జామ్​కు సంబంధించి వస్తున్న వదంతులు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని తెలంగాణ పోలీస్​ ఉద్యోగ నియామక మండలి ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 28న జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామ్​ లో కొన్ని ప్రశ్నల గురించి తలెత్తిన గందరగోళం పూర్తిగా నిరాధారమైనదని.. అభ్యర్థులను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నమ్మవద్దని హెచ్చరించింది. త్వరలోనే ప్రిలిమినరీ ఎగ్జామ్​ కీ విడుదల చేస్తామని.. సబ్జెక్ట్ నిపుణుల కమిటీతో చర్చించి అన్ని విషయాలను పారదర్శకంగా.. న్యాయంగా పరిశీలించటం జరుగుతుందని ప్రకటనలో ప్రస్తావించింది. అభ్యర్థులు తప్పుడు సమాచారం నమ్మవద్దని.. అధికారికంగా బోర్డు విడుదల చేసే ప్రకటనలను మాత్రమే సరైనవిగా పరిగణించాలని సూచించింది. ఆదివారం జరిగిన పరీక్షలో 5 నుంచి 8 ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయని.. కొన్నింటికీ రెండేసి సమాధానాలుంటే కొన్ని సమాధానాలు లేవని సోషల్​మీడియాలో సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో TSLPRB ఈ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!