HomeLATESTటీఎస్​ ఐసెట్ హాల్ టికెట్లు విడుదల.. 26, 27 తేదీల్లో పరీక్ష

టీఎస్​ ఐసెట్ హాల్ టికెట్లు విడుదల.. 26, 27 తేదీల్లో పరీక్ష

తెలంగాణలోని వివిధ యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో అందుబాటులో ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కార్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-ఐసెట్‌ (TS ICET 2023) హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://icet.tsche.ac.in/ నుంచి తమ తమ అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ పరీక్షను మే 26, 27 తేదీల్లో ప్రతీ రోజు రెండు సెషన్లలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement

ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే?
Step 1: అభ్యర్థులు మొదటగా https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హోం పేజీలో కనిపించే Download Hall Ticket ఆప్షన్ పై క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
Step 3: ఆ పేజీలో రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి Download Hall ticket ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: మీ హాల్ టికెట్ స్క్రీన్ పై డిస్ప్లే అవుతుంది. ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!