తెలంగాణ పదో తరగతి ఫలితాలు (TS TENTH RESULTS 2023) రేపు విడుదలవుతాయి. మే 10వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 25వ తేదీ నాటికి వాల్యుయేషన్ ప్రక్రియ కూడా ముగిసిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు 4.8 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
TS TENTH RESULTS 2023 DIRECT LINK
తెలంగాణ టెన్త్ ఫలితాలు (SSC PUBLIC EXAMS RESULTS 2023) వెలువడగానే అఫిషియల్ వెబ్సైట్ https://bse.telangana.gov.in లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మార్క్స్ మెమో డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ మార్కుల వివరాలు తెలుసుకునేందుకు ఫలితాల డైరెక్ట్ లింక్ మెరుపులు.కామ్‌లో అందుబాటులో ఉంది.