HomeLATESTఇంటర్ ఫలితాలు విడుదల

ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్‌ సెకండియర్​ రిజల్ట్స్​ ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన వారందరూ పాసైనట్లు ప్రకటించారు. మొత్తం 4,51,585 మంది విద్యార్థుల్లో 2,28,754 మంది బాలికలు, 2,22,831 మంది బాలురు ఉన్నారు. 1,04,886 మంది విద్యార్థులు గ్రేడ్‌ -ఏ  61,887 మంది గ్రేడ్‌ -బి  సాధించగా.. 1,08,093 మందికి సీ గ్రేడ్‌ వచ్చింది.

కరోనా తీవ్రత కారణంగా ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలను బోర్డు రద్దు చేసింది. ఫస్టియర్​ లో వచ్చిన మార్కులే రెండో ఏడాదికి కేటాయించారు. ఇంటర్​ ప్రాక్టికల్స్​కు వందకు వంద శాతం మార్కులు ఇచ్చారు. గతంలో ఫెయిల్‌ అయిన సబ్జెక్టులకు 35 శాతం మార్కులను, బ్యాక్‌లాగ్స్‌ ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో ఏడాది 35 మార్కులను కేటాయించారు. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇచ్చారు.ఫలితాలను 
http://tsbie.cgg.gov.in,  
http://examresults.ts.nic.in
http://results.cgg.gov.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.

మార్కుల మెమోలో తప్పులుంటే ఫిర్యాదు చేసేందుకు ఇంటర్‌బోర్డు అవకాశం కల్పించింది. టోల్ ఫ్రీ నెంబర్‌ 040 24600110కు ఫోన్‌ చేయాలి.

Advertisement

http://examresults.ts.nic.in/

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!