తెలంగాణ ఎడ్‌సెట్ కీ విడుదలైంది. వీటిపై అభ్యంతరాలుంటే 31వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ సాయంత్రం లోగా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా తెలియజేయాలని ఉన్నత విద్యామండలి సూచించింది. జలై 26వ తేదీన ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించింది. మూడు సెషన్లలో ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ఈ ఎగ్జామ్‌కు సంబంధించిన ప్రిలిమినరీ కీని వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమినరీ కీలో అభ్యంతరాలు ఉన్నట్లయితే అఫిషియల్ వెబ్సైట్లో ఉన్న ఫామ్ ఫిల్ చేసి నమోదు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల జవాబు పత్రాలు కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. తమ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి రెస్సాన్స్ షీట్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.