టీఎస్ ఎంసెట్ (TS EAMCET 2022) అడ్మిషన్ కార్డులను జూన్ 25 నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రకటన విడుదల చేశారు. ఇంజనీరింగ్,అగ్రికల్చర్,ఫార్మసీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అగ్రికల్చర్,ఫార్మసీ స్ట్రీం జూలై 14,15 తేదీల్లో,ఇంజనీరింగ్ స్ట్రీం జూలై 18,19,20 తేదీల్లో జరగనుంది. వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డులు జూన్ 25 వ తేదీ నుంచి జూలై 11 వ తేదీ వరకు ఎంసెట్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు జూన్ 27వ తేదీ వరకు రూ.2,500 ఫైన్‌తో ఎంసెట్‌కు అప్లై చేసుకునేందుకు తుది గడువు ఉంది. రూ. 5,000 ఫైన్ తో జూలై 7 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
CLICK HERE TO DOWNLOAD TS EAMCET 2022 ADMIT CARD
టీఎస్ ఎంసెట్ అడ్మిషన్ కార్డులు డౌన్లోడ్ చేసుకొండి
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS