తెలంగాణలో 9231 గురుకుల ఉద్యోగాల భర్తీకి ఇటీవల తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREI-RB) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు TSPSC ఉద్యోగాల మాదిరిగా ముందుగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఓటీఆర్ ను నమోదు చేసి అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఒకటి కన్నా ఎక్కువ పోస్టలకు అర్హత కలిగిన అభ్యర్థుల సౌకర్యార్థం ఈ సదుపాయాన్ని కల్పించింది బోర్డు. తద్వారా అభ్యర్థులు ప్రతీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నప్పుడల్లా మళ్లీ మళ్లీ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం ఉండదు.
ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభించారు. ఇందుకోసం అభ్యర్థులు ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.
Step 1: అభ్యర్థులు మొదటగా https://treirb.telangana.gov.in/index.php ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
Step 2: హోం పేజీలో Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Steps 3: అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో New Registration (OTR)? ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: తర్వాత ఆధార్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం Go ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5: ఇతర పేర్కొన్న వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
RELATED POSTS