Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటీఎస్​పీఎస్​సీ ఓటీఆర్ మిస్సయిందా..? ఆధార్​, పుట్టిన తేదీతో పొందండి ఇలా..

టీఎస్​పీఎస్​సీ ఓటీఆర్ మిస్సయిందా..? ఆధార్​, పుట్టిన తేదీతో పొందండి ఇలా..

తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ వన్​ టైమ్​ రిజిస్ట్రేషన్​(ఓటీఆర్​) నంబర్​ మిస్సయిందా..? డోంట్​ వర్రీ.. ఓటీఆర్ నెంబర్​ పోగొట్టుకున్న అభ్యర్థులందరి కోసం టీఎస్​పీఎస్సీ (TSPSC) తమ వెబ్​సైట్​లో కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

అభ్యర్థులు టీఎస్​పీఎస్​సీ వెబ్​సైట్​లోకి వెళ్లి Know Your TSPSC ID అనే ఆప్షన్​ను క్లిక్​ చేసి ఆధార్​ నంబర్​, పుట్టిన తేది వివరాలను ఎంటర్​ చేస్తే.. మీ ఓటీఆర్​ నంబర్​ కనిపిస్తుంది. వచ్చిన ఓటీఆర్​ నంబర్​ ఆధారంగా అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్​ చేసుకోవచ్చు.

Advertisement

తెలంగాణ ఏర్పడ్డాక టీఎస్​పీఎస్సీ వెబ్​సైట్​లో 25 లక్షల మంది నిరుద్యోగులు వన్​ టైమ్​ రిజిస్ట్రేషన్​ చేసుకున్నారు. ఇప్పుడు జాబ్​ రిక్రూట్​ మెంట్​ అనౌన్స్​మెంట్​ తర్వాత టీఎస్​పీఎస్​సీ ఓటీఆర్​ వివరాలు కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఎడిట్​ చేసే ఆప్షన్​ ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు 75,692 మంది పాత అభ్యర్థులు తమ స్థానికత , విద్యార్హతల వివరాలను మార్చుకున్నారు. 25,194 మంది కొత్త అభ్యర్థులు రిజిస్ట్రేషన్​ చేసుకున్నారు.

మీరు మీ ఓటీఆర్​ తెలుసుకోవాలంటే.. ఇక్కడ క్లిక్​ చేయండి.. https://www.tspsc.gov.in/tspscIdAadharNo

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!