Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsసివిల్స్​ ఫ్రీ రెసిడెన్షియల్​ కోచింగ్​.. జులై 2 ఆఖరు తేదీ

సివిల్స్​ ఫ్రీ రెసిడెన్షియల్​ కోచింగ్​.. జులై 2 ఆఖరు తేదీ

తెలంగాణ ఎస్సీ స్టడీసర్కిల్ లో సివిల్స్​ ఫ్రీ కోచింగ్​ కు అప్లికేషన్లకు జులై 2వ తేదీ ఆఖరు తేదీ. హైదరాబాద్​లోని ఈ స్టడీ సర్కిల్ లో సివిల్స్ ప్రిలిమినరీ మరియు మెయిన్స్ ఎగ్జామ్​కు పది నెలల రెసిడెన్షియల్ కోచింగ్ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఇందులో మొత్తం 100 మంది విద్యార్థులకు ఫ్రీ కోచింగ్​ అందిస్తారు. స్టడీ సర్కిల్​ నిర్వహించే పరీక్షలో మార్కుల మెరిట్ ఆధారంగా సెలక్షన్​ ఉంటుంది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ లలో జూలై నెల 9 వ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్ (100 ప్రశ్నలు), సి-శాట్ (40 ప్రశ్నలు) పరీక్ష.. మొత్తం 140 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 2300 మంది దరఖాస్తు చేసుకున్నట్లు డైరెక్టర్​ శ్రీధర్​ ప్రకటన విడుదల చేశారు. మొత్దం వంద సీట్లలో 75 ఎస్సీలకు, 15 సీట్లు బీసీలకు, 10 సీట్లు ఎస్టీలకు కేటాయిస్తారు. మొత్తం సీట్లలో 33.33% మహిళలకు, 5% వికలాంగులకు రిజర్వ్ చేస్తారు.

Advertisement

గత ఏడాది (2022-23) ఈ స్టడీ సర్కిల్​లో కోచింగ్​ తీసుకున్న అభ్యర్థుల్లో 18 మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయి.. మెయిన్స్ పరీక్ష రాశారు. వారిలో ముగ్గురు ఇంటర్వ్యూ కు వెళ్లారు. వీరిలో జనగాంకు చెందిన కొయ్యాడ ప్రణయ్​కుమార్​ 885 వ ర్యాంకు సాధించారు. అందుకే సివిల్ సర్వీసెస్ కు ప్రిపేరవుతున్న అభ్యర్థులు స్టడీ సర్కిల్​లో కోచింగ్​ను ఉపయోగించుకోవాలని, వెంటనే అప్లై చేసుకోవాలని స్టడీ సర్కిల్​ డైరెక్టర్​ సూచించారు.

ఆన్ లైన్​లో అప్లై చేసుకునేందుకు అధికారిక వెబ్​సైట్​ www.tsstudycircle.co.in లో లాగిన్​ కావాలి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!