HomeLATESTటీఎస్​ సెట్​ 2023 అప్లికేషన్ల గడువు పొడిగింపు

టీఎస్​ సెట్​ 2023 అప్లికేషన్ల గడువు పొడిగింపు

తెలంగాణ స్టేట్​ ఎలిజిబులిటీ టెస్ట్ (TS SET 2023) అప్లికేషన్ల షెడ్యూలులో మార్పులు చోటు చేసుకున్నాయి. టీఎస్​సెట్​ అప్లికేషన్ల గడువును సెప్టెంబర్​ 4వ తేదీ వరకు పొడిగిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది. ఆగస్ట్ 5వ తేదీ నుంచి అప్లికేషన్ల స్వీకరణ మొదలైంది. కొత్త షెడ్యూల్​ ప్రకారం సెప్టెంబర్​ 4వ తేదీ వరకు అప్లికేషన్లకు తుది గడువుగా నిర్ణయించింది. నిర్ణీత లేట్​ ఫీజుతో సెప్టెంబర్​ 24వ తేదీ వరకు అప్లికేషన్లకు గడువు ఉంటుంది. అక్టోబర్​ 28, 29, 30వ తేదీన పరీక్షలు నిర్వహిస్తారు. వారం రోజుల ముందుగా 20 వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్​ టికెట్లను డౌన్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్​​ ప్రొఫెసర్లు, కాలేజీల్లో లెక్చరర్​ పోస్టులకు ఎలిజిబులిటీ పరీక్షగా సెట్​ నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సెట్​ లేదా పీహెచ్​డీ తప్పనిసరి అర్హతగా ఉంటుంది. తెలంగాణ వరుసగా రిలీజవుతున్న ఉద్యోగ రిక్రూట్​మెంట్ నోటిఫికేషన్ల నేపథ్యంలో తెలంగాణ సెట్​ కీలకం కానుంది.
http://www.telanganaset.org/

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!