నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 1520 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అదనంగా 146 పోస్టులను నోటిఫై చేసినట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.
అదనపు పోస్టులతో కలిసి మొత్తం ఉద్యోగాల సంఖ్య 1,666కు పెరిగాయి. దీంతో పాటు అభ్యర్థుల వయో పరిమితిని 44 నుంచి 49 ఏళ్లకు పెంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సర్వీస్ వెయిటేజీ కింద ఇచ్చే మార్కులను 20 నుంచి 30కు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా వివరాలను వెల్లడించారు.